కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల తెలంగాణ… దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్ ఉండే.. దాన్ని వద్దనుకుని కొల్లాపూర్ కి వచ్చానని, కేసీఆర్ కుటుంబం ఒక వైపు.. తెలంగాణ సమాజం.. యువత.. మహిళ లు మరోవైపు ఉన్నారన్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో సమాజం చూస్తూనే ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దగా చేసిందన్నారు రాహుల్ గాంధీ. కాళేశ్వరం కట్టించి ఏడాది కూడా కాలేదని, అప్పుడే కూలిపోయే పరిస్థితి వచ్చింది అంటే మనం అర్థం చేసుకోవచ్చునన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టులు కట్టింది.. నాగార్జున సాగర్, సింగూర్, జూరాల కట్టింది కాంగ్రెస్సే.. మేము కట్టిన అన్ని ప్రాజెక్టులు చూడండి.. మరో వైపు కాళేశ్వరం చూడండి.. తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ.. బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒక్కటై పని చేస్తున్నాయని రాహుల్ గాంధీ వెల్లడించారు.
అంతేకాకుండా.. ‘ఇక్కడికి మా సోదరి రావాల్సి ఉండే. మా చెల్లి రాలేని పక్షంలో నేను వచ్చా. మీకు..మాకు ఉన్న బంధం కుటుంబ బంధం అందుకే నేను వచ్చా. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దగా చేసింది. బీజేపీ.. బీఆర్‌ఎస్ కలిసి ప్రజల సొమ్ము లూటీ చేస్తు్న్నాయి. లక్ష కోట్లు .. కేసీఆర్ సొమ్ము దోచుకున్నాడు. రైతులు..పేదలు.. సామాన్యుల నుండి మింగేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో పేదలకు భూములు ఇచ్చింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి లాక్కుంటుంది. ధరణి పేరుతో భూములు లాక్కుని కుట్ర జరుగుతోంది. తెలంగాణ లో 20 లక్షల మందికి ధరణి తో నష్టం. ధరణి తో కేవలం కేసీఆర్ కుటుంబం కె లాభం జరిగింది. రెవెన్యూ.. లిక్కర్.. ఇసుక అమ్ముకునే శాఖ అన్నీ కేసీఆర్ కుటుంభం దగ్గరే ఉన్నాయి. తెలంగాణ పోరాటం దొరల తెలంగాణ కోసం కల కనలేదు.
ప్రజల తెలంగాణ కోరుకుంది, తెలంగాణ లో బీఆర్‌ఎస్.. కాంగ్రెస్ మధ్యనే పోటీ. బీజేపీ..బీఆర్‌ఎస్.. ఎంఐఎం ఒక్కటై పని చేస్తున్నాయి. లోక్ సభలో కేసీఆర్.. బీజేపీ కి మద్దతు ఇస్తోంది. జీఎస్టీ.. రైతు చట్టాలకు కూడా మద్దతు పలికింది. బీజేపీ.. ఎంఐఎంకి ఓటేస్తే బీఆర్‌ఎస్‌కి వేసినట్టే. ఇక్కడ బీఆర్‌ఎస్‌తో.. మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీతో కొట్లాడుతున్నాం. ఇక్కడ బీఆర్‌ఎస్‌ని ఓడగొడతాం. 2024 లో ఢిల్లీలో కూడా బీజేపీ ని నిలువరిస్తాం. తెలంగాణ లో అధికారం.. డబ్బులు..మీడియా కేసీఆర్ వెంట ఉన్నాయి, ప్రజలు కాంగ్రెస్ తో ఉన్నారు. ప్రజలు.. కాంగ్రేస్ కార్యకర్తలు కలిసి..ప్రజల తెలంగాణ కోసం పని చేయండి. ఇవాళ ఇందిరా గాంధీ వర్థంతి. మనది రాజకీయ బంధం కాదు..కుటుంబ బంధం. మా నానమ్మ కి తెలంగాణ అండగా నిలబడింది. జీవితంలో చారిత్రాత్మక సత్యం మరిచిపోలేను. మీరు పోరాడితే.. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును.. మేము అధికారం లోకి రాగానే ప్రజల జేబులోకి వచ్చేలా చేస్తాం.’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.