NTV Telugu Site icon

Rahul Gandhi: కూరగాయల వ్యాపారికి భోజనం వడ్డించిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

Rahul

Rahul

Rahul Gandhi: పెరుగుతున్న ఆహార పదార్థాల ధరలతో కష్టాల్లో కూరుకుపోయిన కూరగాయల వ్యాపారికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన చేతులతో భోజనం వడ్డించారు. ఇటీవల ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండీలో పెద్దసంఖ్యలో టమాటాలు కొనేందుకు వచ్చిన రామేశ్వర్… అక్కడి ధరలు చూసి టమాటాలు కొనలేకపోయాడు. టమాటాల ధరలు చూసి అతడు కన్నీటి పర్యంతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో రామేశ్వర్ ను కలుసుకునేందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆజాద్ పూర్ మండీకి వెళ్లారు. ఆ సమయంలో రామేశ్వర్ అక్కడ లేడు. ఆ తర్వాత తనకోసం రాహుల్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఆ కూరగాయాల విక్రేత ఉబ్బితబ్బిబయ్యాడు. తనకు రాహుల్‌ను కలుసుకోవాలనుందని చెప్పాడు. ఈ నేపథ్యంలో, రాహుల్ గాంధీ… కూరగాయల విక్రేత రామేశ్వర్‌ను తన నివాసానికి పిలిపించారు. అతడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాదు, డైనింగ్ టేబుల్‌పై అతడితో కలిసి భోజనం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Read Also: Rajasthan: కోటా హాస్టల్స్లో ఆత్మహత్యలను తగ్గించేందుకు వినూత్న ఆలోచన..!

“మీ హృదయం నుండి మాట్లాడటం బలహీనత కాదు, అది నిజాయితీ. ఇతరులు చెప్పేదాని గురించి ఆలోచించకండి. మీరు సత్యానికి మాత్రమే కట్టుబడి ఉంటారు” అని రాహుల్ గాంధీ రామేశ్వర్‌తో అన్నారు. భారతదేశపు వాణిని వినిపించి పోరాటాలకు సహకరించడం మనందరి నైతిక బాధ్యత అంటూ ఆ వీడియోను రాహుల్‌ గాంధీ పంచుకున్నారు. వారి సమావేశం నుంచి కొన్ని హృదయాలను కదిలించే క్షణాలను వీడియో క్యాప్చర్ చేసింది. లంచ్ టేబుల్ వద్ద రాహుల్‌ గాంధీ వారికి వడ్డిస్తున్నప్పుడు రామేశ్వర్, అతని భార్య కలిసి కూర్చున్నారు. “ఆమె (నా భార్య) ఈరోజు ఉపవాసం ఉంది” అని రామేశ్వర్ తెలియజేశాడు. రాహుల్‌ గాంధీ ఆమెకు పండ్లు తీసుకోవడానికి అనుమతి ఉందా అని త్వరగా ఆరా తీసి, ఆమె కోసం కొంత తీసుకుంటానని చెప్పారు.

Read Also: Viral Video: దోమను చంపబోయి బొక్క ఇరగొట్టుకున్నాడు.. వీడియో వైరల్

రాహుల్‌ గాంధీ “సర్” అని సంబోధించడానికి నిరాకరించారు. “నన్ను సార్‌ అని ఎందుకు పిలుస్తున్నారు. నా పేరు రాహుల్, అలా పిలవండి” అని రామేశ్వర్‌తో రాహుల్‌ గాందీ అన్నారు. ఈ సమావేశానికి ముందు రామేశ్వర్ ఈ అవకాశాన్ని పొందడం ఎంత అదృష్టమో పేర్కొంటూ.. “సుదామ కృష్ణుడిని కలవడం”తో పోల్చాడు. సుదాముడు, కృష్ణుడు చిన్ననాటి స్నేహితులు, వారు కలిసి పెరిగారు. వారి భావోద్వేగ కలయిక నిజమైన స్నేహానికి ఉదాహరణగా పురాణాల ప్రకారం తెలిసింది. కాంగ్రెస్ నాయకుడు తన బాధను అర్థం చేసుకున్నారని, ఆయన ఆతిథ్యం ఇవ్వడం తన అదృష్టమని రామేశ్వర్ అన్నారు.