NTV Telugu Site icon

Rahul Gandhi: నాపై దాడులకు ఈడీ యత్నిస్తోంది.. రాహుల్ సంచలన ఆరోపణలు

Rahulgandhi

Rahulgandhi

లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ‘చక్రవ్యూహం’ ప్రసంగం తర్వాత తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేయాలని యోచిస్తోందని తెలిపారు. ఈడీ ఇన్‌సైడర్లు దీనిపై సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఎక్స్ లో ఈ మేరకు ఓ పోస్ట్‌ చేశారు. అందులో.. “నా చక్రవ్యూహం ప్రసంగం కొందరికి నచ్చలేదు. దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు ఈడీ ‘ఇన్‌సైడర్‌లు’ నాకు చెప్పారు. ఈడీ కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తు్న్నాను. చాయ్‌, బిస్కెట్లతో వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్న.” అని పోస్ట్ లో రాశారు.

READ MORE: Telangana Assembly 2024: నేడు అసెంబ్లీలో మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చ..

వాస్తవానికి, జూలై 29న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2024పై రాహుల్ గాంధీ ప్రసంగించారు. ‘‘చక్రవ్యూహంలో భాగంగా కోట్లాది ఉద్యోగాలు ఇచ్చే చిన్న, మధ్యతరహా పరిశ్రమలను టార్గెట్‌ చేశారు. నోట్లరద్దు , జీఎస్టీ , ట్యాక్స్‌ టెర్రరిజంతో బెదిరించారు. చిన్న వ్యాపారులకు అర్ధరాత్రి ఫోన్‌కాల్స్‌ వస్తాయి.. ఐటీ , జీఎస్టీ అధికారులతో వాళ్లను బెదిరించి ట్యాక్స్‌ టెర్రరిజానికి పాల్పడుతున్నారు. ట్యాక్స్‌ టెర్రరిజానికి ఆపడానికి బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ట్యాక్స్‌ టెర్రరిజంతో బడా వ్యాపారులకు లాభం చేశారు. చిన్నవ్యాపారులను బెదరించారు’’ అని రాహుల్ గాంధీ మాట్లాడారు.

READ MORE:Wayanad Landslides : వాయనాడ్‌లో రెస్క్యూను వేగవంతం చేసేందుకు బెయిలీ బ్రిడ్జీ నిర్మించిన సైన్యం

ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని ‘పద్మవ్యూహం’లోకి నెట్టివేస్తున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత, కుల గణనలతో ఇండియా కూటమి దానిని విచ్ఛిన్నం చేస్తుందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌ 2024-25పై లోక్‌సభలో జరుగుతున్న చర్చలో భాగంగా సోమవారం రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తదితరులపై విమర్శలు సంధించారు. ఈ ప్రసంగం తర్వాత తనపై దాడులు చేసే అవకాశం ఉందని తెలిపారు.