Site icon NTV Telugu

Rahul Gandhi : మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ..

Rahul Gandhi

Rahul Gandhi

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బిజీబిజీగా ఉంటున్నారు. రాహుల్ అప్పుడప్పుడు సామాన్య ప్రజలతో కలిసి సందడి చేస్తున్నారు. ఆదివారం బెంగళూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజీగా ఉన్న రాహుల్ గాంధీ ఇవాళ ( సోమవారం ) బెంగళూరులో బీఎంటీసీ బస్సు ఎక్కి కొన్ని కిటోమీటర్లు ప్రయాణించి అందరికి షాక్ కు గురిచేశాడు.

Also Read : Kalavedika: ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో పలువురికి పురస్కారాలు!

బెంగళూరులోని కన్నింగ్ హ్యామ్ రోడ్డులో రాహుల్ గాంధీ ఇవాళ ప్రత్యక్షం అయ్యారు. కన్నింగ్ హ్యామ్ రోడ్డులోని కాఫీ డే ఔట్ లోకి వెళ్లిన రాహుల్ కాఫీ డేలో కాఫీ తాగుతున్న ప్రజలతో కాసేపు మాట్లాడారు… అనంతరం అక్కడ నుంచి అదే కన్నింగ్ హ్యామ్ రోడ్డులోని బీఎంటీసీ బస్ స్టాప్ దగ్గరకు వెళ్లారు. అదే టైంలో శివాజీనగర్ నుంచి లింగరాజపురం వెళ్తున్న బీఎంటీసీ బస్సు రావడంతో టక్కున బస్సు ఎక్కి అందులో ఉన్న విద్యార్థులకు, ప్రయాణికులకు రాహుల్ గాంధీ షాక్ ఇచ్చారు. లింగరాజపురం బస్సులో ఉన్న విద్యార్థులు, మహిళలతో మాట్లాడుతూ చాలా దూరం ప్రయాణించి వారి సమస్యను తెలుసుకున్నారు.

Also Read : Rana Daggubati: అందుకే నేను లావు అయ్యాను.. ప్రెగ్నెన్సీపై రానా భార్య క్లారిటీ

అయితే బెంగళూరులో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి వచ్చిన రాహుల్ గాంధీ ఆదివారం డెలవరీ బాయ్ స్కూటర్ మీద ఎక్కి బెంగళూరులోని రెండు కిలోమీటర్లు రౌండ్స్ కొట్టారు. అక్కడే ఐకానిక్ ఏయిర్ లైన్స్ హోటల్ లో డెలవరీ బాయ్స్ తో కలిసి మసాలా దోసె తిని కాఫీ తాగిన రాహుల్ గాంధీ వారితో చాలా సేపు చర్చించారు. ఆదివారం రాత్రి ఆనేకల్ లో జరిగిన బహిరంగ సభలో బీజేపీ మీద రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకలో సీఎం కుర్చీని రూ. 2, 500 కోట్లకు అమ్మేశారని రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు.

Exit mobile version