Site icon NTV Telugu

Rahul Gandhi: ఓట్ చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా.. నేటి రాహుల్ గాంధీ ప్రెస్మీట్పై ఉత్కంఠ

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ ( సెప్టెంబర్ 18న) ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఇందిరా భవన్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు జరగబోయే ఈ విలేకరుల సమావేశంపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. పార్టీ వర్గాలు ఆయన ప్రసంగం ఏ అంశాలపై ఉంటుందనే విషయాన్ని ఇప్పటికీ వరకు చెప్పకపోవడంతో ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ ప్రెస్ మీట్ కీలకం కాబోతుందని కాంగ్రెస్ భావిస్తున్నారు.

Read Also: OG : సెన్సార్ పనులు ముగించుకున్న ‘ఓజి’

అయితే, రాహుల్ గాంధీ ప్రెస్ మీట్‌లో ఓటు చోరీపై చేస్తున్న ఆరోపణలను బయట పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓట్ల చోరీ విషయంలో హైడ్రోజన్ బాంబు పెలుస్తానంటూ ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు. ఈ ఆరోపణలతో అధికారపక్షం ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఇటీవలే పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలపై అనేక అనుమానాలు, అక్రమాలు బయట పడటంతో, రాహుల్ గాంధీ ప్రస్తావించే అంశాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read Also: Viral video: రైలు కింద పడుకున్నా ఏం కాలేదంటే… నువ్వు నిజంగా దేవుడివి స్వామి..

కాగా, కాంగ్రెస్ ఇప్పటికే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న నినాదంతో జోరుగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ ఎలాంటి వివాదాలకు దారి తీస్తుంది అనే ఆసక్తి రేకెత్తిస్తుంది. రాహుల్ ప్రసంగం ద్వారా కేవలం ఓటు చోరీ ఆరోపణలకే కాకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని పలు విమర్శలు చేసే అవకాశం కూడా ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రెస్ మీట్ తర్వాత పాలిటిక్స్ మరింత హీటెక్కే ఛాన్స్ ఉంటుంది.

Exit mobile version