NTV Telugu Site icon

Rahul Gandhi: మీరు ఎలానైనా పిలవండి.. ప్రధాని వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్

Rahul

Rahul

ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రతిపక్షాల కూటమి పేరుపై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ.. విపక్షాలను ఇండియన్ ముజాహిదీన్‌తో పోల్చారు. ప్రతిపక్ష కూటమి I.N.D.I.A అని పేరు పెట్టుకున్నంత మాత్రాన వారి తీరు మారుతుందా? అని ప్రశ్నించారు. ఆఖరికి పీఎఫ్ఐ వంటి ఉగ్ర సంస్థల పేరులో కూడా ఇండియా ఉందన్నారు. ఇప్పటివరకు ఇలాంటి దిశ, దశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Baby: ‘బేబీ’నా మజాకా.. 11 రోజుల్లో అర్జున్ రెడ్డి కలెక్షన్స్ బ్రేక్ చేసిందిగా!

ప్రధాని మోదీ విమర్శలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. మణిపూర్‌ను నయం చేయడానికి ప్రతిపక్ష కూటమి సహాయం చేస్తుందని రాహుల్ పేర్కొన్నారు. మణిపూర్‌లో ఇండియా ఆత్మను పునర్నిర్మించడంలో సహాయపడుతుందని తెలిపారు. మీరు ఎలానైనా పిలవండి. మేము ఇండియా. మేము మణిపూర్‌ను నయం చేయడానికి, అక్కడి మహిళలు, పిల్లల కన్నీళ్లు తుడవడానికి సహాయం చేస్తాము. ప్రజలందరికీ ప్రేమ మరియు శాంతిని తిరిగి తెస్తాము. మేము మణిపూర్‌లో భారతదేశం ఆత్మను పునర్నిర్మిస్తాము’’రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Government Jobs :పది అర్హతతో ఉద్యోగాలు..116 పోస్టుల భర్తీ గ్రీన్ సిగ్నల్..

మరోవైపు ప్రధాని కామెంట్స్‌పై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కూడా స్పందించారు. ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తాము మణిపూర్ గురించి మాట్లాడితే.. మోదీ మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.