NTV Telugu Site icon

Bhatti vikramarka : గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతమే రాహుల్ లక్ష్యం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti vikramarka : కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల సమక్షంలో రాహుల్ గాంధీ పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  వెల్లడించారు.  అట్టడుగు వర్గాలు
స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన సంకల్పించారని తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బుధవారం జరిగిన ఏఐసీసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ తెలంగాణ కుల గణన అంశాన్ని ప్రస్తావించడాన్ని హర్షించారు. దేశంలోని సంపదను అందరితో సమంగా పంచుకోవాలన్నదే కాంగ్రెస్ సిద్ధాంతమని చెప్పారు. దండి సత్యాగ్రహం స్ఫూర్తితో కాంగ్రెస్ ముందుకు సాగుతోందని, సబర్మతి ఒడ్డునుంచి మరోసారి న్యాయ్ పథ్ ద్వారా దేశానికి నూతన సందేశం ఇచ్చేందుకు ఈ ప్లీనరీ సమావేశం ఉపయోగపడిందన్నారు.

కుల గణన సర్వే లాంటి చర్యల ద్వారా వనరులు, అవకాశాలను అందరికీ అందించాలన్న సంకల్పాన్ని కాంగ్రెస్ చూపించిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రారంభం నుంచి పార్టీ నిర్మాణంపై స్పష్టమైన ఆలోచనతో ఉన్నారని, గ్రామ స్థాయి బూత్ కమిటీల నుండి జిల్లా స్థాయి కాంగ్రెస్ నాయకత్వం వరకు సమగ్రంగా పునర్నిర్మాణం జరగాలని నిర్ణయించినట్టు తెలిపారు. జిల్లా అధ్యక్షులే తమ పరిధిలో జరిగే ప్రతి కార్యాచరణకు నాయకత్వం వహించాలని, త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేయబోతున్నామని భట్టి స్పష్టం చేశారు.
Off The Record : రాజకీయ ఉనికి కోసం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తంటాలు..?