NTV Telugu Site icon

Rahul Gandhi: గుజరాత్, ఢిల్లీ ఘటన‌లపై రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్

Rahul Gandhi

Rahul Gandhi

Fire Accident: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శనివారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టీఆర్పీ గేమింగ్ జోన్‌లో మంటలు చెలరేగడంతో 27 మంది మరణించారు. అదే విధగా శనివారం అర్ధరాత్రి ఢిల్లీలోని వివేక్ విహార్‌‌ న్యూ బోర్న్ బేబీ కేర్ ఆసుపత్రిలోనూ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు చనిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆ రెండు ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. గుజరాత్‌ రాష్ట్రం రాజ్‌కోట్‌లోని ఓ గేమింగ్ జోన్‌లో జరిగిన భారీ ఫైర్ యాక్సిడెంట్లో అమాయక చిన్నారులు సహా పలువురు చనిపోయారనే వార్త చాలా బాధాకరం అని చెప్పుకొచ్చారు. అదే, విధంగా ఢిల్లీలోని చిల్డ్రన్స్ హస్పటల్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మరణించడం నన్ను తీవ్రంగా కలచి వేసింది అని పేర్కొన్నాడు.

Read Also: Ghaziabad : ఇద్దరు భర్తలను విడిచిపెట్టి.. బావతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌.. కట్ చేస్తే

ఈ సందర్భంగా మృతుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. గాయపడిన వారందరూ తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.. సహాయ కార్యక్రమాల్లో అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ కార్యకర్తలను ఆయన పిలుపునిచ్చారు. గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలు ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తును చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేవారు. అలాగే, మృతుల కుటుంబాలందరికీ సత్వర న్యాయం అందించాలని రాహుల్ గాంధీ కోరారు.

Show comments