Nitish Kumar: ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. ఇందుకు కాంగ్రెస్ కూడా సపోర్టు ఇస్తుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు రాహుల్ ఫోన్ చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢీల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లు ఖర్గే పేరును ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. దేశానికి తొలి దళిత వ్యక్తిని ప్రధాన మంత్రిగా ప్రకటించిన ఘనత కూడా దక్కుతుందని ఇండియా కూటమి అభిప్రాయపడింది. ఈ ప్రకటనను ఎమ్‌డీఎమ్‌కే నేత వైకోతో సహా పలువురు ఇండియా కూటమి నేతలు సపోర్టు ఇచ్చారు.
Read Also: Redmi Note 13 Pro: రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర, ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకే..
ఇక, ఇండియా కూటమి బలాబలాలపై రాహుల్ గాంధీ, నితీష్ కుమార్ మధ్య ఫోన్ కాల్ లో చర్చించుకున్నారు. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరు ప్రస్తావన అనే విషయం తనకు తెలియదని నితీష్ కుమార్ ఈ సందర్భంగా చెప్పినట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో బిహార్ కేబినెట్‌లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్యను పెంచుతానని నితీష్ కుమార్ హామీ ఇచ్చారు. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికలకు తమ అభ్యర్థులను అతి త్వరలో నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాగా, ఢిల్లీలో ఇటీవల కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమరానికి రెడీ కావాలని నేతలకు సూచించింది. రాహుల్ భారత్ జోడో యాత్ర 2.0 (తూర్పు-పశ్చిమం)కు సన్నాహాలు చేయాలని ఈ మీటింగ్ లోనే పార్టీ నేతలకు చెప్పారు. ఈ సమావేశంలో 76 మంది నేతలు పాల్గొన్నారు.. దేశంలో కాంగ్రెస్ భవిష్యత్‌పై ప్రధానంగా చర్చించుకున్నారు.