Site icon NTV Telugu

Rahul Gandhi: గురువారం నుంచి రాహుల్ యాత్ర పున: ప్రారంభం.. ఏ రాష్ట్రం నుంచంటే..!

Gandhi

Gandhi

రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం వాయిదా పడింది. సోనియాగాంధీ (Soniya Gandhi) రాజ్యసభకు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా వాయిదా పడింది. జైపూర్‌లో సోనియా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్, ప్రియాంక (Priyanka Gandhi) పాల్గొన్నారు. మరోవైపు ఢిల్లీలో రైతులు జరుపుతున్న ఆందోళనలో పాలుపంచుకునేందుకు రాహుల్ వెళ్లడంతో యాత్ర రద్దయినట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

ఇక గురువారం బీహార్‌లోని ఔరంగాబాద్ నుంచి రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని పార్టీ ప్రకటించింది. ఔరంగాబాద్‌లో గురువారం తిరిగి భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొంటారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ తెలిపారు.

జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర షెడ్యూల్ ప్రకారం 68 రోజుల్లో 6,713 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల గుండా ప్రయాణిస్తూ మార్చి 20న ముంబైకి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. మధ్య మధ్యలో రాహుల్ బ్రేక్‌లు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనుకున్న సమయానికి ముగిస్తారా? లేదంటే పొడిగిస్తారో చూడాలి.

Exit mobile version