NTV Telugu Site icon

Rahul Gandhi : చిన్నారిని ఆటోగ్రాఫ్ ఇస్తావా అని అడిగిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

Rahul

Rahul

Rahul Gandhi : ఇటీవల భారత జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలకు చేరువవుతున్నారు. దేశ వ్యాప్తంగా జనాలను కలుస్తూ వారి కష్ట నష్టాలను తెలుసుకుంటున్నారు. ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ కుదరితే అక్కడ సామాన్యులతో కలిసిపోతున్నారు. ఇప్పటికే రాహుల్ సామాన్యలతో కలిసి లారీ నడిపారు, బైక్ మెకానిక్ గా మారారు, అంతేకాదు పొలం పనులు కూడా చేశారు. ఇక తాజాగా రాహుల్ చాక్లెట్లు కూడా తయారుచేశారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. రాహుల్ ఓ చిన్నారిని తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: Afghanistan: మహిళలపై మరో ఆంక్ష విధించిన తాలిబన్ ప్రభుత్వం.. మరీ ఇంత దారుణమా?

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల రాహుల్ గాంధీ  తన సొంత నియోజకవర్గం వాయనాడ్ వెళుతూ మార్గమధ్యంలో ఊటీలో ఆగారు. అక్కడ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించారు  రాహుల్. దాని గురించి చెబుతూ ఆశ్చర్యానికి గురయ్యారు రాహుల్. ఎందుకుంటే ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలో అందరూ మహిళలే ఉద్యోగం చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు వారే చూసుకుంటారు. ఇక చాక్లెట్ ఎలా తయారు చేయాలో వారిని అడిగి తెలుసుకున్న రాహుల్ ఆయన కూడా తయారు చేశారు.

ఇక అక్కడే ఓ చిన్న పిల్ల బుక్, పెన్ పట్టుకొని వచ్చి రాహుల్ గాంధీని ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరింది. ఆమెకు తన ఆటోగ్రాఫ్ ఇచ్చిన రాహుల్ నాకు ఓ సాయం చేస్తావా అని ఆ చిన్నారిని అడిగారు. దీంతో ఆ చిన్నారి నవ్వుతూ తల ఊపింది. రాహుల్ ఆ చిన్నారిని తనకు బుక్, పెన్ కావాలని కోరారు. ఆ చిన్నారి ఆనందంగా ఆయనకు పెన్, బుక్ ఇచ్చింది. దానిని రాహుల్ గాంధీ ఆ పాపకే ఇచ్చేసి నీ ఆటోగ్రాఫ్ కావాలి ఇస్తావా అని అడిగాడు. దాంతో ఆ చిన్నారి తన పేరును ఆ బుక్ పై రాసి రాహుల్ కు ఇచ్చింది. రాహుల్ ఆ పేజీని చింపుకొని జేబులో పెట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంది. ఇది చూసిన వారు సో క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఎంఎస్ఎంఈ లు అధిక ట్యాక్స్ ల కారణంగా ఎదగలేకపోతున్నాయని, 18 శాతం జీఎస్టీ వాటి విస్తరణకు పెద్ద అడ్డంకి అని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను పంచుకుంది.