NTV Telugu Site icon

Manifesto BJP: బీజేపీ లోక్‌సభ మ్యానిఫెస్టోపై ఆరోపించిన విపక్షాలు..!

2

2

2024 లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు ఆదివారం నాడు ఆరోపించాయి. ఎన్నికల పత్రంలో చేసిన వాగ్దానాలు “అబద్ధాలతో నిండి ఉన్నాయి., అలాగే అవి అవిశ్వసనీయమైనవి అని ఆరోపించాయి. మేనిఫెస్టోలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని కాషాయ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు వారు ఆరోపించారు. బీజేపీ మేనిఫెస్టోలో పేదలు, యువకులు, రైతులు, మహిళలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల పత్రాన్ని విడుదల చేస్తూ., తమ ప్రభుత్వం ఏకరూప పౌర నియమావళిని (యూసీసీ) అమలు చేస్తామని, ఏకకాలంలో ఎన్నికలు (ఒకే దేశం, ఒకే ఎన్నికలు) నిర్వహిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు.

Also read: Canada: కెనడాలో 24 ఏళ్ల భారతీయ విద్యార్థిని దారుణహత్య..

మరోవైపు ఈ మ్యానిఫెస్టోపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ., బీజేపీ మేనిఫెస్టోలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎక్కడ కనిపించడం లేదన్నారు. “ప్రజల జీవితాలకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలను చర్చించడానికి కూడా బీజేపీ ఇష్టపడదంటూ.. ఇండియా కూటమి ప్రణాళిక చాలా స్పష్టంగా ఉందని. అందులో 30 లక్షల పోస్టులకు రిక్రూట్‌మెంట్, చదువుకున్న ప్రతి యువకుడికి 1 లక్ష రూపాయల పర్మినెంట్ ఉద్యోగం అని ఆయన ట్వీట్ పూర్వకంగా తెలిపారు. ఈసారి యువత ప్రధాని మోదీ ట్రాప్‌లో పడబోదని, ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌ చేతులను బలోపేతం చేసి దేశంలో ఉపాధి విప్లవాన్ని తీసుకొస్తారని అన్నారు.

Also read: Jagan Mohan Reddy: సీఎం పై రాళ్ళ దాడి కేసు దర్యాప్తు మరింత ముమ్మరం.. టాస్క్ ఫోర్స్ అధ్వర్యంలో..?!

ఇక అలాగే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోషల్ మీడియా పూర్వాంకగా తాను.. బీజేపీ మేనిఫెస్టో ఒక బూటకం అని, వారి నిజమైన మేనిఫెస్టో ‘సంవిధాన్ బద్లో పాత్ర’ (రాజ్యాంగాన్ని మార్చే మేనిఫెస్టో) అని ఆరోపించారు. ‘‘దేశం, సమాజం, ప్రజాస్వామ్యంపై బీజేపీ ఈ కుట్రలన్నీ అట్టడుగు నుంచి ప్రారంభిస్తుందని గుర్తుంచుకోండి.. ముందుగా అగ్రనేతలు ప్రజల ముందు రాజ్యాంగంపై ప్రమాణం చేస్తారని., కానీ రాత్రికి రాత్రే రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు కూడా స్క్రిప్ట్ రాస్తారంటూ పేర్కొంది. ఆపై పూర్తి అధికారం దక్కిన తర్వాత రాజ్యాంగంపై దాడికి దిగుతారని’’ అని ప్రియాంక గాంధీ ఆరోపించారు.

Show comments