Site icon NTV Telugu

Rahul Gandhi Bihar Yatra: బీహార్‌లో ఓట్ల దోచుకునేందుకు చూస్తున్నారు: రాహుల్ గాంధీ

Rahulgandhi22

Rahulgandhi22

Rahul Gandhi Bihar Yatra: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు బీహార్‌లో ‘ఓటర్ అధికార యాత్ర’ను ప్రారంభించారు. బీహార్‌లోని ససారాం ప్రారంభమైన యాత్రలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ యాత్ర దాదాపు 16 రోజుల పాటు రాష్ట్రంలోని 25 జిల్లాలు కవర్ చేస్తూ కొనసాగనుంది. యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ-ఆర్ఎస్ఎస్ దేశంలో రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

READ MORE: Mahesh Babu : మహేశ్ బాబు మూవీకి అలా చేస్తే ఓపెనింగ్స్ రావన్నారు.. నిర్మాత కామెంట్స్

కొత్త ఓటర్ల వచ్చిన చోట్ల వారే గెలిచారు..
కాంగ్రెస్ పార్టీ చేసిన దర్యాప్తులో ఈసీ మహారాష్ట్రలో 1 కోటి మంది ఓటర్లను కొత్తగా సృష్టించిందని అన్నారు. ఎక్కడ కొత్త ఓటర్లు వస్తే అక్కడ బీజేపీ కూటమి గెలిచిందన్నారు. అసలు అన్నిచోట్ల అంత మంది కొత్త ఓటర్ల ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. తమ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ఓటర్లపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కర్ణాటకలో చేసిన దర్యాప్తులో అన్ని రికార్డులను పోల్చితే రాష్ట్రంలో ఒక్కో అసెంబ్లీలో లక్షకు పైగా ఓట్లు చోరీ అయినట్లు గుర్తించామన్నారు. వీటిపై ఈసీకి ఫిర్యాదు చేస్తే తన నుంచి అఫిడవిట్ కోరిందని అన్నారు. వాళ్ల దగ్గర ఉన్న డాటా గురించి ప్రశ్నిస్తే ఇలా అడగడం సరైనదా అని ప్రశ్నించారు. సీసీ టీవీ, వీడియోగ్రఫీని అడిగితే దానికి కూడా నిరాకరించినట్లు తెలిపారు. దేశంలో చాలా చోట్ల లోక్‌సభ, అసెంబ్లీల్లో ఓట్లు చోరీకి గురి అవుతున్నాయన్నారు. ఓటర్లను విభజించడం ద్వారా బీహార్‌లో కూడా ఓట్లను చోరీ చేయడానికి వారు సిద్ధమవుతున్నారని, కానీ తాము, బీహార్ ప్రజలు వారికి ఈ అవకాశం ఇవ్వమని స్పష్టం చేశారు. ఈసీ ఏం చేస్తుందో దేశం మొత్తానికి తెలుసని, ఈసీ ఓట్లను ఎలా దొంగిలిస్తుందో తాము దేశ ప్రజలందరికీ చూపించామన్నారు. ప్రధాని మోదీ కుల గణన సరిగ్గా చేయడం లేదని విమర్శించారు. పార్లమెంట్‌లో జనగణనతో పాటు కులగణన కావాలని కేంద్రాన్ని నిలదీసినట్లు చెప్పారు. 50% రిజర్వేషన్ల అడ్డుగోడని తొలగించాలని కోరామని, కానీ ఎన్డీయే సర్కార్ ఆ పని చేయదన్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి కులగణన చేస్తుందని, 50 శాతం రిజర్వేషన్ల అడ్డు గోడను కూల్చే్స్తుందన్నారు.

మోడీ-నితీష్ బీహార్‌ను మోసం చేశారు: తేజస్వి
ప్రధాని మోడీ- సీఎం నితీష్ బీహార్‌ను మోసం చేశారని తేజస్వి యాదవ్ విమర్శించారు. మనం ఈ చెడ్డ ప్రభుత్వాన్ని మార్చాలని, నేరస్థులు ప్రతిచోటా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. ఓట్లను దోచుకుంటున్న వారికి గుణపాఠం చెప్పాలని అన్నారు. ఇది ఓట్ల దొంగతనం కాదని, దోపిడీ అని అన్నారు. బీహార్ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని, ఇక్కడ రాహుల్ గాంధీ, తేజస్వి మహాఘట్‌బంధన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయనివ్వదని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడటానికి ఇది తమ పోరాటంగా రాహుల్‌గాంధీ అభివర్ణించినట్లు తెలిపారు. నితీష్ కుమార్ అపస్మారక స్థితిలో ఉన్నారని, నిజాయితీ లేని వ్యక్తులను అధికారం నుంచి తొలగించడం ద్వారా బుద్ధి చెప్పాలన్నారు.

READ MORE: Cyclone Alert: ఏపీ ప్రజలు అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో 24 గంటల్లో?

Exit mobile version