Site icon NTV Telugu

T20 కెప్టెన్‌గా రోహితే శర్మ నా ఛాయిస్‌: రాహుల్‌ ద్రవిడ్‌

t20 వరల్డ్‌ కప్‌ తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు విరాట్‌ కోహ్లీ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తర్వాత టీ20లో ఇండియా సారథి ఎవరనే దానిపై చర్చోపచర్చలు జరగుతున్నాయి. దీంతో టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా ఎంపికైన రాహుల్‌ ద్రావిడ్‌ పరిమిత ఓవర్లలో టీమిండియాకు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఉండవ చ్చని అన్నాడు. అతడికి ఉన్న అనుభవం దృష్య్టా కెప్టెన్‌గా రోహితే తన ఫస్ట్‌ ఛాయిస్‌ అని రాహుల్‌ ద్రావిడ్‌ పేర్కొన్నాడు.

ఈ వరల్డ్‌ కప్‌ తర్వాత విరాట్‌ కెప్టెన్సీ నుంచి వైదలగనున్న నేపథ్యంలో, తర్వాతి కెప్టెన్‌ ఎవరనే దానిపై అనేక వార్తలు వస్తు న్నాయి.ఈ సమయంలో ద్రవిడ్‌ ప్రకటన చర్చనీయాం శంగా మా రింది. ద్రవిడ్ అన్నట్టు తర్వాతి కెప్టెన్‌ హిట్‌ మ్యాన్ రోహిత్ శర్మనేనా లేదా బీసీసీఐ వేరే ప్రత్యామ్నాయం కోసం వెతుకుందా అనే విషయం తెలియాలంటే క్రికెట్‌ అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Exit mobile version