Rahul Chahar: మరో టీమిండియా క్రికెటర్ విడాకులు.. చిన్న వయసులో పెళ్లి చేసుకుని మూల్యం చెల్లించుకున్నానంటూ..
- మరో టీమిండియా క్రికెటర్ విడాకులు
- రాహుల్ చాహర్ తన భార్య ఇషానీ జోహార్ నుండి విడిపోతున్నట్లు ధృవీకరించారు
- దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత ఆ జంట విడాకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ తన భార్య ఇషానీ జోహార్ నుండి విడిపోతున్నట్లు ఫిబ్రవరి 20 శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ధృవీకరించారు. రాహుల్ మార్చి 9, 2022న గోవాలో ఇషానీని వివాహం చేసుకున్నాడు. దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత ఆ జంట విడాకులు తీసుకున్నారు. వివాహం సమయంలో రాహుల్ వయస్సు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. విడిపోయిన తర్వాత, రాహుల్ తన భావాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
Also Read:IND vs SA Playing 11: అక్షర్ ఇన్.. సుందర్ ఔట్.. టీం ఇండియా ప్లేయింగ్ 11లో మార్పులు?
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
రాహుల్ తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. “నేను చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకున్నాను. అప్పటికి నాకు నా స్వంత విలువలు, నా గురించి పూర్తి అవగాహన లేదు, జీవితంలో నిజంగా ఏమి కావాలో కూడా తెలియదు. ఆ తర్వాత సంవత్సరాలు నాకు ఊహించని పాఠాలు నేర్పాయి. గత 15 నెలలు కోర్టుల చుట్టూ తిరిగాను.. అక్కడ నాకు ఓర్పు, సహనశక్తి, సత్యం నుంచి వచ్చే బలం వంటివి నేర్పాయి. ఈ రోజు ఆ అధ్యాయం అధికారికంగా ముగిసింది. చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాక విషయం సెటిల్ అయింది. అయితే ఈ తీర్పు నాకు చాలా ఖర్చు అయింది. నేను ఈ అధ్యాయాన్ని కోపంతో లేదా పశ్చాత్తాపంతో కాకుండా, స్పష్టతతో ముగిస్తున్నాను. కొన్ని సంబంధాలు శాశ్వతంగా ఉండాలని ఉండవు. అవి మనల్ని మేల్కొల్పడానికి, నేర్పడానికి, మార్చడానికి ఉంటాయి. ఇప్పుడు స్వీయ-గౌరవం, ధైర్యం, మెరుగైన నిర్ణయాలతో కొత్త ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాను. అభిమానులు, సపోర్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై క్రికెట్‌పై పూర్తి దృష్టి పెడతానని చెప్పారు.
Also Read:Trump Tariffs: టారిఫ్ వార్‌కు బ్రేక్.. ట్రంప్‌కు యూఎస్ సుప్రీంకోర్టులో బిగ్ షాక్..
చాహర్ విడాకుల వ్యవహారం క్రికెట్ వరల్డ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా వంటి భారత క్రికెటర్ల నిజ జీవితాల్లో ఇలాంటి మార్పులు కనిపించాయి. ఈశాని జోహర్ ఇంకా ఈ విషయంపై బహిరంగంగా ఏమీ చెప్పలేదు. అభిమానులు రాహుల్ చాహర్‌కు మద్దతిస్తున్నారు. ఈ కష్టకాలం తర్వాత కూడా సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్న అతని వైఖరిని ప్రశంసిస్తున్నారు. కొత్త జీవితం, క్రికెట్ కెరీర్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నారు. రాహుల్ చాహర్ IPL 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడతారు. IPL 2026 కోసం జరిగిన మినీ వేలంలో, రాహుల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 5.20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. గతంలో అతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ విడుదల చేసింది. రాహుల్ చాహర్ ఇప్పటివరకు భారతదేశం తరపున ఒక ODI, ఆరు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడాడు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!