కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు రాహుల్ గాంధీ కదం తొక్కుతూ పాదయాత్రకు దిగిన సంగతి తెలిసిందే. భారత్ జోడో యాత్ర ఇవాళ కేరళలో కొనసాగింది. మలప్పురంలో ముగిసిన యాత్ర రాహుల్ నియోజకవర్గమైన వయనాడ్ కు చేరుకుంది. ఇవాళ నిలంబూర్ లోని చుంగతార నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. కేరళలోని కన్యాకుమారిలో ప్రారంభం అయిన భారత్ జోడో యాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. రేపు కర్నాటక లోకి ప్రవేశిస్తున్న రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నేతలు. రేపు ఉదయం 9 గంటలకు చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట్ వద్ద నున్న ఊటీ- కాలికట్ జంక్షన్ వద్ద కర్నాటక లోకి ప్రవేశించనుంది రాహుల్ పాదయాత్ర. తమిళనాడు కేరళలో 457 కిలోమీటర్ల మేర 22 రోజుల పాటు సాగింది భారత్ జోడో యాత్ర.
Read Also: Rashmi Gautam: పూల చీరలో రష్మీ.. అందరి చూపు ఆ నడుముపైనే
రేపటి నుండి 17 రోజుల పాటు కర్నాటకలో సాగనుంది రాహుల్ పాదయాత్ర. రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలకడానికి గుండ్లపేట్ చేరుకున్నారు కర్నాటక పీసీసి చీఫ్ డీకే శివకుమార్..సిద్దరామయ్య ఇతర సీనియర్ నేతలు.. రేపు, అక్టోబర్1న రెండు రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. అక్టోబర్2 న గాంధీ జయంతి సంధర్భంగా రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రకు విరామం ప్రకటించారు. కర్నాటక తర్వాత ఏపీ తెలంగాణ లోకి ఎంటరవనుంది రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాహుల్ గాంధీకి భారీగా స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు, ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Kottu Satyanarayana on Dasara: ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లు భేష్.. లడ్డూ సూపర్
సెప్టెంబర్ 10న తమిళనాడు నుంచి కేరళలోకి ప్రవేశించిన ఈ యాత్ర శుక్రవారం కర్ణాటక లోకి ఎంటర్ కానుంది. 19 రోజుల వ్యవధిలో 7 జిల్లాల మీదుగా 450 కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలో యాత్ర జరగనుంది. తర్వాత రాహుల్ యాత్ర తెలంగాణలో కొనసాగనుంది. అక్టోబర్ 24న మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ లో ప్రవేశించి 366 కిలోమీటర్ల మేర సాగనుంది. మొత్తం 4 నియోజకవర్గాల్లోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ యాత్ర సాగనుంది. కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు సాగనుంది. ఈ యాత్ర మొత్తం 3వేల 750 కిలోమీటర్ల మేర సాగనుంది. యాత్ర ద్వారా కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహం పొందుతున్నాయి.
Read Also: Uttam Kumar Reddy : భూములు అన్యాక్రాంతం అవుతుంటే అధికారులు స్పందించడం లేదు
