NTV Telugu Site icon

KKR vs RCB: ఐపీఎల్ వేలంలో చిన్న చూపు.. తొలి మ్యాచ్‌లోనే నిరూపించుకున్న రహానే..

Rahane

Rahane

బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది కోల్‌కతా నైట్‌ రైడర్స్‌. అజింక్య రహానె (56), సునీల్ నరైన్ (44), రఘువంశీ (30) పరుగులు చేశారు. కాగా.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రహానేపైనే అందరి దృష్టి మళ్లింది. అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన రహానే.. అన్ని ఫార్మాట్‌లలో ఆడాడు. కానీ క్రమంగా టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం అయ్యాడు. టెస్ట్ క్రికెట్‌లో ప్రధానంగా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే రహానే – తన రాక్-స్టోలిడ్ టెక్నిక్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన విధానాన్ని అభివృద్ధి చేసుకున్నాడు.

READ MORE: Pooja Hegde : సినిమాల్లో హీరోయిన్లపై వివక్ష ఉంది.. పూజాహెగ్దే సంచలన కామెంట్స్

ఇదిలా ఉండగా.. రాను రాను రహానేను కేవలం టెస్ట్ క్రికెట్‌కే పరిమితం చేశారు. ఐపీఎల్ 2025 వేలంలోనూ ఏ ఫ్రాంచైజ్ కొనగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. చాలా తక్కువ ధరకే (రూ.1.5 కోట్లు) డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‎కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. రహానేపై నమ్మకంతో జట్టు పగ్గాలను కూడా అప్పగించింది. ఆ నమ్మకాన్ని రహానే నిలబెట్టుకున్నాడు. తొలి మ్యాచులోనే మంచి స్కోర్ సాధించి టీంను నిలబెట్టాడు.18 సీజన్‌లో మొదటి అర్ధం సెంచరీ పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. సిక్సులు, ఫోర్లతో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 56 పరుగులు సాధించి స్కోర్ పెంచి టీం పరువు కాపాడాడు. ఇటు తనపై విశ్వాసం ఉంచిన కేకేఆర్ యాజమన్యం పేరు నిలబెడుతూ.. మరోవైపు.. తనను కొనుగోలు చేసేందుకు ముందుకు రానటువంటి ఫ్రాంచైజ్ లకు తానేంటో అనేది నిరూపించుకున్నాడు.