Site icon NTV Telugu

Breaking News : రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్

Cm Jagan

Cm Jagan

రేషన్ లబ్ధిదారులకు మార్చి 1 నుంచి రాగిపిండిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కిలో ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనుంది. రాగిపిండి ధర బహిరంగ మార్కెట్ లో కేజీకి రూ.40పైనే పలుకుతుండగా, ప్రభుత్వం రూ.11కే ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఒక్కో కార్డుకు ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు/జొన్నలు ఇస్తున్న సంగతి తెలిసిందే. రాగి పిండిని ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అ­ల్లూ­రి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నంలో పంపిణీ చేస్తారు.

Mexico Gang Clash: మెక్సికోలో గ్యాంగ్ వార్.. 12 మంది మృతి

అలాగే రాయలసీమలోని కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఒక్కో కార్డుకు ప్రస్తుతం ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు/జొన్నలను అందజేస్తోంది. రేషన్‌కార్డుదారులు వాటిని మిల్లింగ్‌ చేసుకుని వినియోగించుకుంటున్నారు. ఇకపై లబ్దిదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా.. రాగిపిండి పంపిణీ చేయనున్నారు. అయితే.. రాగిపిండి బహిరంగ మార్కె­ట్‌లో కిలో రూ.40పైనే పలుకుతుండగా ప్రభుత్వం లబ్దిదారులకు కిలో రూ.11కే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది.

Upcoming Smartphones 2024: అద్భుత ఫీచర్లతో.. త్వరలో లాంచ్ కానున్న టాప్ 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!

Exit mobile version