Ragi Cultivation : రాగి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాగి లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. అందుకే రాగులకు ఏడాది పొడవున డిమాండ్ ఉంటుంది.. రాగుల పంటను అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు..నీటి సదుపాయం తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ఈ పంట బాగా పండుతుంది. ఎటువంటి వాతావరణంలో అయిన పండుతుంది. రైతులు ఈ పంటను పండించడానికి మొగ్గు చూపిస్తున్నారు.. రాగుల సాగులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అధిక లాభాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు..
ఖరిఫ్ లో వర్షాధారంగా ,యాసంగిలో ఆరుతడి పంటగా రాగిని సాగుచేసుకోవచ్చును. నీటి లభ్యత తగ్గినప్పుడు మరియు కొద్ది పాటి చౌడు సమస్య ఉన్న పరిస్థితులలో రాగి పంట సాగు ద్వారా మంచి దిగుబడులు పొందవచ్చును.. రాగి పంటను ఆశించే తెగుళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడిని పొందవచ్చు.. రాగి పంటలో ఎక్కువగా వచ్చే తెగుళ్లు ఇవే..
Also Read
- Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్‌పై సజ్జల తీవ్ర విమర్శలు..
- RCB Fans: కప్ గెలిచిన ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకపాయే.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..
- Virat Kohli: ట్రోఫీ గెలిచిన ఆనందంలో అనుష్క, దినేశ్ కార్తిక్ ఎమోషనల్ హగ్.. విరాట్ రియాక్షన్ మాములుగా లేదుగా.!
- Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
అగ్గి తెగులు..
నారు మడిలో సోకినప్పుడు లేత మొక్కలు మాడిపోతాయి. ఎదిగిన మొక్కల ఆకుల పై దారపు కండె ఆకారంలో మచ్చలు చుట్టూ ఎరుపు గోధుమ రంగు అంచులు ఉండి మధ్యలో బూడిద రంగు కల్గి ఉండును. కనుపుల మీద కూడా ఈ వ్యాధి నలుపు రంగు మచ్చల రూపంలో కనిపిస్తుంది. మెడ విరుపుగా ఆశించినప్పుడు కణుపు దగ్గర మొక్క విరిగిపోతుంది.. అలాగే గింజలు తాలు గింజలు అంటే తెల్లగా సచ్చుగా మారతాయి..
నివారణ..
3 గ్రాముల థైరామ్ లేక కాప్టాన్ ను కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ది చేయాలి. మొక్కల పై మచ్చలు కనిపించిన వెంటనే కార్బముడిజిమ్ మందును లీటరు నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పైరు పై పిచికారి చేయాలి..
పెనుబంక..
పంట బెట్టకు గురైనపుడు చాలా ఉదృతంగా ఆశిస్తుంది. చిన్న మరియు పెద్ద పురుగులు ఆకు పచ్చ, నీలిరంగు కలిపిన వర్ణంలో ఉంటాయి. ఇవి ఆకులు మరియు కంకులు నుండి రసం పీలుస్తాయి. ఆశించిన మొక్కలలో పెరుగుదల తగ్గి మాడిపోయినట్లు కనిస్తాయి. పైరు చిన్న దశలో అసిస్తే కంకులు రాకపోవడం మరియు గింజలు రాకపోవడం వంటివి జరుగుతాయి..
నివారణ..
డైమిథోయెట్ 2 మి. లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి. లీ లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి.ఇలా చేయడం వల్ల తెగుళ్ళను నివారించి పంటను కాపాడుకోవచ్చు.. రాగులు గురించి ఇంకేదైనా సందేహాలు ఉంటే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Jagapathi Babu: ఎడిటింగ్‌లో బలయ్యా.. ‘పుష్ప 2’పై జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు?
-
Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
-
Srikanth Odela : నాని ‘పారడైజ్’లో మెగాస్టార్? శ్రీకాంత్ ఓదెల మైండ్ బ్లోయింగ్ మల్టీవర్స్ ప్లాన్!
-
Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
-
Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్‌పై సజ్జల తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!