Raghuveera Reddy: దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అన్నారు ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షులు, సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు నామినేషన్ కార్యక్రమానికి హాజరైనప ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ మత రాజకీయాలతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని ఆరోపించారు. బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు తప్ప దేశ ప్రయోజనాలు లేవు … పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ దేశాన్ని వెనక్కి నెట్టిందన్నారు. ఇంద్రమ్మ లాంటి పరిపాలన దేశానికి అవసరం బలంగా ఉందన్న ఆయన.. రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కనిపిస్తుందన్నారు. రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు బరిలో ఉన్నారు.. రాజమండ్రి ప్రజల మద్దతు గిడుగు రుద్రరాజుకు కనిపిస్తుందన్నారు.
Read Also: Train Accident : రైలులో మంటలను ఆర్పే సమయంలో పేలుడు.. కానిస్టేబుల్ మృతి
నామినేషన్ వేసే సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వేలాదిమంది తరలివచ్చారు.. రాజమండ్రిలో ఇంత జనాన్ని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాకు చాలా సంతోషంగా ఉందన్నారు రఘువీరారెడ్డి.. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో గిడుగు రుద్రరాజుకు ఓటేసి గెలిపించండి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతామని హామీ ఇచ్చారు.. విభజనకు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడింది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తీసుకొస్తాం అన్నారు రఘువీరారెడ్డి.