Raghunandhan Rao: రేవంత్ రెడ్డికి మెదక్ లో తప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చారని.. అన్ని అబద్ధాలే మాట్లాడారని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక లో ఏ రంగుతో పోటీ చేశానో, మెదక్ లో అదే రంగు తో పోటీ చేస్తున్ననని.. కొడంగల్ లో ఓడిన రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో గెలవలేదా.? దుబ్బాకలో ఓడితే మెదక్ లో పోటీ చేయకూడదా.? అని ప్రశ్నించారు. ఇక్రిశాట్ 1972 లో ఏర్పాటు అయ్యిందని.. బీహెచ్ఎల్ 1964 నెహ్రూ కాలంలో ఏర్పాటు చేశారని చెప్పారు. ఇందిరా గాంధి హయాంలో ఇక్రిశాట్ లు, బీహెచ్ఎల్, బీడీఎల్, ఐడీపీఎల్ సంస్థలు వచ్చాయని రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారన్నారు.
1980లో ఇందిరా గాంధి మెదక్ లో గెలిస్తే మెదక్ రైల్ వే లైన్ తెస్తానని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. 40 ఏళ్ళలో రాని మెదక్ రైల్ వే లైన్ ను మోదీ పదేళ్ళలో ప్రారంభించారన్నారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతామని చెప్పిన కాంగ్రెస్ నాయకుల మాటలను గుర్తు చేశారు. ఎంతమందికి కేసీఆర్ సొమ్మును పంచారో రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. బీసీలకు లక్ష కోట్లతో పాటు కేసీఆర్ దోచుకున్న సొమ్ముతో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న హామీని గుర్తు చేశారు.
మోదీ పదేళ్ల అభివృద్ధిపై చర్చకు నేను రెడీ, రేవంత్ సిద్దమా..? తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర చర్చ చేద్దామా..? నేనొక్కడినే వస్తా.. రేవంత్ రెడ్డి వస్తాడా..? అని సవాల్ విసిరారు. మెదక్, గజ్వేల్, సిద్దిపెట్ రైల్వే స్టేషన్ లోనైనా చర్చకు సిద్ధమా..? అని ప్రశ్నించారు. నిర్మాణాత్మకమైన అభివృద్ధిని మెదక్ జిల్లాకు అందించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. దుబ్బాక అభివృద్ధి నేను కాదు దుబ్బాక ప్రజలే చెబుతారన్నారు.
READ ALSO:CM Revanth reddy: సివిల్ టాపర్ అనన్యను సన్మానించిన సీఎం
క్యాబినెట్ లో ఎంత మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారో రేవంత్ చెప్పాలన్నారు. ముదిరాజ్ వర్గం నుంచి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గంపై రేవంత్ రెడ్డి కమిట్ మెంట్ ఇదేనా..? అని ప్రశ్నించారు. రైతు బంధు హామీ ఏమైందని అడిగారు.
ఆటో డ్రైవర్లు కు 15 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు లు దొంగ మాటలు చెప్పి దుబ్బాక లో రఘునందన్ రావు ను దొంగ దెబ్బ కొట్టారే తప్పా తాను ఓడిపోలేదన్నారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి నొటికేదోస్తే అది మాట్లాడుతున్నారని.. మోదీని బడే బాయ్ అన్నది రేవంత్ రెడ్డే నని స్పష్టం చేశారు. రైతు రుణ మాఫీకి ఆగస్ట్ మాసానికి ఎంటి సంబంధం అని ప్రశ్నించారు. టీడీపీలో జరిగిన ఆగస్టు సంక్షోభం ఏమైనా గుర్తొస్తుందా..? జూన్ 4 కే ఎన్నికల కోడ్ ముగుస్తుంది.. జూన్ 10 కి రైతు రుణ మాఫీ చేయలేరా..? అలా చేయడం చేతకాకపోతే ప్రజలకు క్షమాపణలు చెబుతారా..? రైతు రుణ మాఫీ చేయకపోతే రాజ్ భవన్ కు వచ్చి రేవంత్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.