Site icon NTV Telugu

Raghunandan Rao: రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది..

Raghunandan

Raghunandan

భూముల అమ్మకానికి చంద్రబాబు నాయుడు కిటికీలు తెరిస్తే.. రాజశేఖర్ రెడ్డి దర్వాజాలు తెరిస్తే.. బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ను అమ్మేస్తున్నారు అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో కూడా భూములను ఉంచుతలేరు.. చివరికి స్మశానం కూడా అమ్మేసారని హైకోర్టు స్టే ఇచ్చింది.. ప్రజల ఆస్తులకు సంరక్షకులుగా ఉండాల్సిన ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తగదు అని రఘునందన్ రావు పేర్కొన్నాడు.

Read Also: Asia Cup 2023: టీమిండియా మిడిల్ ఆర్డర్‌కు వాళ్లు బెస్ట్ ఆప్షన్..

నిర్మల్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలి అని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 220 జీవో రద్దు చేయాలి.. పంట పొలాల్లో 200 ఫీట్ల రోడ్డు ఎందుకు, మాస్టర్ ప్లాన్ పేరుతో దగా చేస్తున్నారు.. రైతు దగ్గర నుంచి భూములు తీసుకోని దాగుడుమూతలు ఆడడం కరెక్ట్ కాదు.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సొంతూరును ఎందుకు మాస్టర్ ప్లాన్ లోని మున్సిపాలిటీలో కలపలేదు.. మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తన పైనే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించు కోవాలి.. కలెక్టరేట్ ఊరవతల ఎందుకు కట్టించారు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో తీసుకొస్తున్న మాస్టర్ ప్లాన్ పై తమ రాష్ట్ర పార్టీలో చర్చించి రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా రఘునందన్ రావు వెల్లడించారు.

Read Also: Kadiam Srihari: ఇన్ని రోజులు మీ ఎమ్మెల్యే ఎవరంటే చెప్పుకోవడానికి సిగ్గుపడేది

అన్ని పార్టీల కంటే ముందే మా అభ్యర్థుల జాబితా వస్తుంది అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు తెలిపారు. రాజకీయ నాయకులు తానున్న పార్టీలో తన మనుగడ లేనప్పుడు మనుగడ కోసం పార్టీలు మారుతూ ఉంటారు.. దానిపై ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.. మనుషుల మధ్య అభిప్రాయ బేధాలు ఉంటే దాన్ని గ్రూపు వారు అనకూడదు.. ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి.. ప్రజాస్వామ్యంలో ఏకాభిప్రాయంతో ముందుకెళ్లడం సాధ్యం కాదు.. డిక్టేటర్ షిప్ లో మాత్రమే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

Read Also: Indian Bank Recruitment 2023: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బ్యాంక్ ఉద్యోగాలకు ఇలా అప్లై చేసుకోండి..

పార్టీ అధ్యక్షుడు మా నిర్ణయాన్ని తెలుపుతూ.. ఆయన ప్రకటించిన నిర్ణయం ఫైనల్ అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఏకాఅభిప్రాయం వచ్చిందని చెప్పలేదు.. చిన్న చిన్న అభిప్రాయ బేధాలు ఉండడం సహజమన్నారు. ఏకాభిప్రాయం దిశగా అడుగులేసేందుకు అందరం చర్చించి నిర్ణయం తీసుకుంటాం.. చర్చల తర్వాత పార్టీ అధ్యక్షుడు ఏ నిర్ణయం ప్రకటిస్తే దాన్ని శిరసా వహిస్తామని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు.

Exit mobile version