NTV Telugu Site icon

Raghunandan Rao : ముత్యాలమ్మ టెంపుల్ ఎపిసోడ్‌లో పూర్తి స్థాయి విచారణ జరగాలి

Raghunandan Rao

Raghunandan Rao

హైదరాబాదులోని శ్రీ ముత్యాలమ్మ దేవి ఆలయం వద్ద శనివారం ఆలయ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున గుమిగూడిన ఆందోళనకారులపై తెలంగాణ పోలీసులు లాఠీచార్జి చేశారు . తెలంగాణలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి), భజరంగ్ దళ్ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నిరసనలకు పలు హిందూ సంస్థలు మద్దతు తెలిపాయి. అయితే.. తాజాగా ఎంపీ రఘునందన్‌ రావు డీజీపీని కలిసి ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరమని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ముత్యాలమ్మ టెంపుల్ ఎపిసోడ్ లో పూర్తి స్థాయి విచారణ జరగాలని, సంఘ విద్రోహ శక్తులు, స్లీపర్ సెల్స్ ఏవైనా కుట్రలు చేస్తున్నాయా..? అని ఆయన ప్రశ్నించారు. ముత్యాలమ్మ టెంపుల్ కు సమీపంలో స్లీపర్ సెల్స్ కు శిక్షణ అని, మునవర్ అనే వ్యక్తి ఎవరు..? ఎక్కడించి వచ్చారు.? ఇంటిలిజెన్స్ ఏం చేస్తోంది..? అని రఘునందన్‌ రావు అన్నారు.

Deputy CM Pawan Kalyan: గత ఐదేళ్లలో పారిశుద్ధ్యంపై ఎలాంటి డబ్బులు ఖర్చులు చేయలేదు..

అక్కడ పర్సనల్ డెవలప్ మెంట్ క్లాసులు జరుగుతున్నాయా..? లేక స్లీపర్ సెల్స్ కు శిక్షణ ఇచ్చారా..? స్లీపర్ సెల్స్ ఓపెన్ సెల్స్ గా మారితే పరిస్థితి ఏంటి..? అని ఆయన ప్రశ్నించారు. నెలల తరబడి శిక్షణ కార్యక్రమాలు జరుగుతుంటే ఇంటిలిజెన్స్, లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోందని, తెలంగాణలో 3 మాసాల వ్యవధిలో 15 మందిరాల మీద దాడులు జరిగాయని, ముత్యాలమ్మ గుడి దగ్గర ర్యాలీ చేస్తే… పోలీసులు అరెస్ట్ లు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. లాఠీ ఛార్జ్ చేస్తున్నారన్నారు రఘునందన్‌ రావు. హిందువులే పోలీసులపై దాడి చేసినట్లు కొంత మంది అధికారులు వీడియోలు రిలీజ్ చేయడం పద్ధతి కాదని, భాగ్యనగర ప్రశాంతతను కాపాడాలన్నారు. సమగ్ర విచారణ జరగాలని డీజీపీని కోరడం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మునావర్ లాంటి వాళ్ళు నెలల కొద్ది శిక్షణ ఇస్తున్నా ఇంటలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు..? అని, ముత్యాలమ్మ గుడి ఘటన పోలీసు ఇంటలిజెన్స్ వైఫల్యమే కారణమన్నారు.

Ganderbal Terror Attack: ఉగ్రవాదంపై పోరులో దేశం ఏకమైంది: రాహుల్ గాంధీ

Show comments