NTV Telugu Site icon

Raghunandan Rao : వెంకట్రామిరెడ్డి ఎన్ని కోట్లు ఇస్తే కేసీఆర్ మెదక్ సీటు ఇచ్చిండు

Raghunandan Rao

Raghunandan Rao

సిద్దిపేట జిల్లా బీజేపి కార్యాలయంలో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్‌ రావు మాట్లాడుతూ.. నిన్న కేసీఆర్ తనపై మాట్లాడిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. రఘునందన్ రావు దుబ్బాక లో ఓడిపోతే కేసీఆర్‌ కామారెడ్డి లో ఓడిపోలేదా అని ఆయన ప్రశ్నించారు. పోలీసులతో డబ్బులు పంచి గెలిచినా కేసీఆర్ కి సిగ్గు ఉండాలని, వెంకట్రామిరెడ్డి ఎన్ని కోట్లు ఇస్తే కేసీఆర్ మెదక్ సీటు ఇచ్చాడని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కి తెలంగాణ పౌరుషం ఉంటే వేంకటేశ్వర స్వామి ఆలయంకి వచ్చి డబ్బులు పంచలేదని ప్రమాణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ కామారెడ్డి ల్లో, కూతురు నిజామాబాద్ లో చెల్లలేదు.. కొడుకు ఎంపీ గా పోటీకి ముందుకు రాలేదని, వెంకట్రామిరెడ్డి కెసిఆర్, హరీష్ రావు కి బినామీ కాదని చెప్పాలన్నారు రఘునందన్‌ రావు. రఘునందన్ రావు మెదక్ ఎంపీ గా గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మిమ్మల్ని శ్రీ కృష్ణ జన్మస్థలానికి పంపడం ఖాయమని, రాధా కిషన్ రావు కేసీఆర్‌ డబ్బులు ఇచ్చి గెలిచాడని చెప్పలేదా..? అని ఆయన అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ పౌరుషం ఉంటే డబ్బులు పంచలేదని వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్‌లో పనిచేసిన నాయకులకు కేసీఆర్ ఎందుకు టికెట్ ఇవ్వలేదని అడిగారు. కేసీఆర్ కామారెడ్డిలో, కూతురు నిజామాబాద్‌లో చెల్లలేదని.. కొడుకు ఎంపీగా పోటీకి ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్, హరీష్ రావుః‌కు వెంకట్ రాంరెడ్డి బినామీ కాదని చెప్పాలని డిమాండ్ చేవఆరు. కేసీఆర్‌కు వెంకట్ రాంరెడ్డి ముద్దు అయితే శ్రీకాంత్ చారి తల్లికి ఎందుకు సీటు ఇవ్వలేదన్నారు.