Site icon NTV Telugu

Raghunandan Rao : ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీకి పోతాం

Raghunandan Rao

Raghunandan Rao

సీఈఓ వికాస్ రాజ్ ను బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు శుక్రవారం కలిశారు. మెదక్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయాలని సీఈఓ కు ఫిర్యాధు చేశారు రఘునందన్ రావు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఒక్కో ఓటర్ కు 5వందల రూపాయలను పంపిణీ చేశారని, ఎన్నిసార్లు ఫిర్యాధు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదన్నారు. బూత్ ల వారీగా లెక్కలు కట్టి ఎన్వలప్ కవర్ లలో ఒక్కో గ్రామానికి డబ్బుల పంపిణీ చేశారని, 20కి పైగా కార్లు ఉన్నాయని ఫిర్యాధు చేస్తే చెగుంట SI ఒక్క కారును పట్టుకున్నారు..అందులో డబ్బులు దొరికాయన్నారు రఘునందన్‌ రావు. సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌కు, మెదక్ ఎస్పీకి సరైన ఆధారాలతో ఫిర్యాధు చేసినా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. ఫామ్ హౌస్ లో హరీష్ రావు, మరో ఆరుగురు ఎమ్మెల్యేలు డబ్బుల పంపిణీ చేశారని, 84లక్షలు 27 పోలింగ్ బూత్ లకు పంపిణీ చేసే డబ్బులను ఒక్క కారులో దొరికాయని ఆయన పేర్కొన్నారు. 84లక్షల డబ్బులను బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఖాతాలో వేసి డిస్క్వాలిపై చేయాలని డిమాండ్ చేస్తున్నానని ఆయన తెలిపారు. తెలంగాణలో ఇంకా బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉందని పోలీసులు అనుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఇక్కడ చర్యలు న్యాయం జరగకపోతే ఢిల్లీకి పోయి ఫిర్యాధు చేస్తామని, ఎఫ్‌ఐఆర్‌లో వెంకట్రామిరెడ్డి ని a5 గా చేర్చారు… అనేది ఎలక్షన్ కమిషన్ గుర్తించాలన్నారు.

Exit mobile version