గజ్వేల్ లో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసేందుకు వెళ్తున్న కామారెడ్డి బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఏడు గంటల పాటు పోలీస్ వ్యానుల్లో తిప్పి బిచుకుంద పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శించడానికి వెళ్తున్న నన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. గజ్వేల్ అభివృద్ధిని చూద్దామని వెళ్తే అరెస్ట్ లు చేస్తారా?.. అని ఆయన విమర్శించారు.
Read Also: One Nation – One Election: వన్ నేషన్ -వన్ ఎలక్షన్‌పై కమిటీ ఏర్పాటు.. సభ్యులు ఎవరెవరంటే..!
తెలంగాణలో హక్కులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది డీజీపీ చెప్పాలి అని బీజేపీ ఎమ్మె్ల్యే రాఘునందన్ రావు అడిగారు. తెలంగాణలో పోలీసులు అత్యుత్సాం ప్రదర్శిస్తున్నారు.. డీజీపీకి తెలుగులో అర్థం కాకపోతే బిహార్ భాషలోనే చెబుతాం.. తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందా లేదా?.. అభివృద్ధి జరిగితే, ఆ అభివృద్ధిని చూడటానికి వెళ్తే అరెస్టులు ఎందుకు చేస్తున్నారు?.. గజ్వేల్ కు తప్పకుండా వస్తాం.. గజ్వేల్ అభివృద్దేంటో చూస్తామని ఆయన పేర్కొన్నారు. రఘునందన్ ను ఎదుర్కొనలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదు.. బీజేపీ-బీ ఫామ్ మీద దుబ్బాకలోనే పోటీ చేస్తానని చెప్పారు. దుబ్బాకలో విజయవంతంగా విజయం సాధించుకొని మళ్లీ అసెంబ్లీకి వస్తాను అని రఘునందన్ రావు తెలిపారు. తనపై ఎన్ని అసత్య ప్రచారాలు చేసిన.. నేను పార్టీ మారే ప్రసక్తి లేదు అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే కోవకు చెందినవి అంటూ ఆయన ఆరోపించారు.
Read Also: Drugs: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత