Gujarat Election Results: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ గుజరాత్ ఇన్‌ఛార్జి రఘు శర్మ తన రాజీనామాను కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గేకి గురువారం సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య ఓటమికి నైతిక బాధ్యత వహిస్తానని శర్మ తన రాజీనామా లేఖలో రాశారు. “నేను గుజరాత్ ఇన్‌ఛార్జి పదవికి రాజీనామా చేస్తున్నాను” అని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఆమోదించాలని ఖర్గేను కోరారు.
Himachal Pradesh Results: గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన జైరాం ఠాకూర్.. సీఎం రేసులో వారే!
ఇదిలావుండగా గుజరాత్‌లో బీజేపీ అఖండ విజయం సాధించింది. 156 సీట్లను గెలుచుకుని చరిత్ర సృష్టించగా, కాంగ్రెస్ 17 స్థానాలకే పరిమితమైంది. ఆప్ 5, ఇతరులు నాలుగు సీట్లను గెలుచుకున్నారు. మరోవైపు హిమాచల్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. అక్కడ కాంగ్రెస్ కు 40 సీట్లు రాగా, బీజేపీకి 25 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆప్ ఖాతా తెరవకపోగా ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ సీట్లకు భారీగా గండిపడింది. 2017 ఎన్నికల్లో 77 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ.. ఈ సారి కనీసం 20 స్థానాలను కూడా దక్కించుకోలేకపోయింది.