Raghav Chadha: గ్రాముల్లో ఛార్జీలు వసూలు చేసేవారు.. గంటల ఆలస్యానికి పరిహారం ఇవ్వరా..? విమాన సంస్థల తీరుపై ఫైర్..!

  • రాఘవ్ చద్దా విమానయాన సంస్థలపై ఘాటు విమర్శలు
  • అదనపు లగేజీపై కఠినంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ఆరోపణ
  • విమానాల ఆలస్యం, రద్దుపై ప్రయాణికులకు పరిహారం లేకపోవడంపై ఆగ్రహం
  • గ్రాముల లెక్కన ఛార్జీలు.. కానీ గంటల ఆలస్యానికి బాధ్యత ఎందుకు లేదని ప్రశ్న..
Raghav Chadha

Raghav Chadha

Raghav Chadha: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ ‘రాఘవ్ చద్దా’ విమానయాన సంస్థల ఏకపక్ష ధోరణిపై ఘాటుగా స్పందించారు. ప్రజల సమ్యసలపై ప్రశ్నించే ఆయన ఈసారి విమానయాన సంస్థల వైఖరిపై విరుచుకపడ్డారు. ముఖ్యంగా ప్రయాణికుల పట్ల విమానయాన సంస్థలు అనుసరిస్తున్న తీరు ఏమాత్రం సమంజసంగా లేదని ఆయన విమర్శించారు.

Donald Trump: ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్.. యుద్ధం ముగింపునకు ట్రంప్ గ్నీన్ సిగ్నల్!

ప్రజల వద్ద ఉన్న అదనపు లగేజీ విషయంలో కఠినంగా వ్యవహరించే కంపెనీలు, విమానాల ఆలస్యం కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు మాత్రం బాధ్యత వహించడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ విషయమై రాజ్యసభలో ఆయన ప్రసంగిస్తూ.. ఓ ఆసక్తికరమైన పోలికను లేవనెత్తారు. “ప్రయాణికులు కేవలం ఒక కేజీ అదనపు లగేజీ తీసుకెళ్తే విమాన సంస్థలు భారీగా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. లగేజీని గ్రాములతో సహా లెక్కించే సంస్థలు, ప్రయాణికుల విలువైన సమయాన్ని గంటల లెక్కన ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు?” అంటూ మంది పడ్డారు. విమానాలు గంటల తరబడి ఆలస్యమైనా లేదా రద్దయినా ప్రయాణికులకు తగిన పరిహారం అందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విమానయాన రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని చద్దా డిమాండ్ చేశారు. మీరు గ్రాముల లెక్కన ఛార్జీలు వసూలు చేస్తున్నప్పుడు, విమానం ఆలస్యమైన ప్రతి గంటకు ప్రయాణికులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత మీపై ఉందని స్పష్టం చేశారు. విమానాల ఆలస్యం, రద్దు వల్ల ఇబ్బంది పడే సామాన్య ప్రయాణికులకు నేరుగా పరిహారం అందేలా ఒక బలమైన వ్యవస్థను రూపొందించాలని ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని కోరారు.

Ravindra Jadeja: గుండెలు పిండేసే దృశ్యం.. CSK ఫ్యాన్స్ నినాదాలకు కన్నీళ్లు పెట్టుకున్న జడేజా(వీడియో)..

తన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్‌ ను సోషల్ మీడియా వేదిక ‘X’ లో పంచుకున్నారు. “ఒక కేజీ అదనపు లగేజీ ఉంటే విమాన సంస్థలు భారీ బిల్లు వేస్తాయి, కానీ 4 గంటల విమానం ఆలస్యమైతే మాత్రం మీకు ఏమీ చెల్లించవు” అంటూ ఆయన చేసిన పోస్ట్ నెటిజన్ల నుండి భారీగా స్పందన అందుకుంటుంది. విమాన ప్రయాణాల్లో తరచూ ఇబ్బందులు ఎదుర్కొనే ప్రయాణికులు చద్దా వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ తమ మద్దతును తెలుపుతున్నారు.