Raghav Chadha: ఉద్యోగం లేదా బిడ్డ..? పరిస్థితి తండ్రికి రాకూడదు.. ఆ సెలవులను చట్టబద్ధం చేయండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghav Chadha: రాజ్యసభ బడ్జెట్ సమావేశాలలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా మరో సామాజిక అంశాన్ని లేవనెత్తారు. ఈసారి ఆయన దేశంలో ‘పితృత్వ సెలవుల’ను (Paternity Leave) ఒక చట్టబద్ధమైన హక్కుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. బిడ్డ పుట్టినప్పుడు కేవలం తల్లికే కాకుండా, తండ్రికి కూడా తగినన్ని సెలవులు ఇచ్చేలా చట్టాల్లో మార్పులు రావాలని ఆయన కోరారు.
Jadeja Kisses CSK Logo: ఇది కదా కావాల్సింది.. CSK లోగోను ముద్దాడిన జడేజా..!
Also Read
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
ఆయన ఈ విషయమై మాట్లాడుతూ.. బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రులిద్దరినీ అభినందిస్తాం. కానీ, ఆ బిడ్డను చూసుకునే బాధ్యత మాత్రం ఒక్క తల్లిపైనే పడుతోంది. ఇది సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి శారీరక విశ్రాంతితో పాటు భర్త మద్దతు ఎంతో అవసరమని, ఆ సమయంలో భర్త తన భార్యకు, బిడ్డకు అండగా ఉండటం ఒక బాధ్యత అని స్పష్టం చేశారు. ఒక తండ్రి తన ఉద్యోగాన్ని లేదా బిడ్డ సంరక్షణను ఎంచుకోవాల్సిన పరిస్థితి రాకూడదని ఈ సందర్బంగా అసలు విషయాన్నీ లేవనెత్తారు.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ప్రైవేట్ రంగంలో పితృత్వ సెలవులపై స్పష్టమైన చట్టం లేకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు. పిల్లల పెంపకం అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదు, అది దంపతులిద్దరి ఉమ్మడి బాధ్యత. మన దేశ చట్టాలు కూడా ఈ వాస్తవాన్ని ప్రతిబింబించాలని చద్దా అన్నారు. తండ్రికి సెలవులు ఇవ్వడం వల్ల కుటుంబ బంధాలు బలపడటమే కాకుండా, సమాజంలో లింగ సమానత్వం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
రాఘవ్ చద్దా తన ప్రసంగానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. తల్లి కోలుకోవడానికి భర్త తోడు అవసరం, అందుకే పితృత్వ సెలవులను చట్టబద్ధం చేయాలని నేను పార్లమెంట్‌లో కోరాను అని రాసుకొచ్చారు. ఈ డిమాండ్ కు సోషల్ మీడియాలో పెద్దెత్తున విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుత సమాజంలో ఇటువంటి సంస్కరణలు ఎంతో అవసరమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
I demanded in Parliament that PATERNITY LEAVE should be a legal right in India.
When a child is born, both parents are congratulated. But caregiving responsibility falls on one. The mother.
A father should not have to choose between caregiving for his newborn and keeping his… pic.twitter.com/sbvC0xfrGO
— Raghav Chadha (@raghav_chadha) March 31, 2026
తాజావార్తలు
-
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
-
Toxic Advance Booking: రిలీజ్కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
-
Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!