Jadeja Kisses CSK Logo: ఇది కదా కావాల్సింది.. CSK లోగోను ముద్దాడిన జడేజా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja Kisses CSK Logo: ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన, భావోద్వేగపూరితమైన దృశ్యం అభిమానుల మనసు గెలుచుకుంది. మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై 8 వికెట్ల భారీ తేడాతో భారీ విజయం సాధించింది.
Also Read
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
- Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
- Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
ఇక మ్యాచ్ విషయం పక్కన పెడితే.. మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ స్టార్ ఆల్రౌండర్, ప్రస్తుత రాజస్థాన్ రాయల్స్ ఆటగాడైన రవీంద్ర జడేజా ప్రత్యర్థి జట్టు ప్లేయర్ ఖలీల్ అహ్మద్‌తో మాట్లాడుతున్న సమయంలో చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జడేజా తన పాత జట్టు సీఎస్కే (CSK)పై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత రవీంద్ర జడేజా ప్రత్యర్థి జట్టు బౌలర్ ఖలీల్ అహ్మద్ మైదానంలో సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఆ సమయంలో ఖలీల్ అహ్మద్ జెర్సీపై ఉన్న సీఎస్కే లోగోను చూసిన జడేజా ఆ లోగోను ముద్దాడాడు. ఈ అద్భుతమైన క్షణాన్ని కెమెరాలు బంధించగా.. నెటిజన్లు దీనిని “బెస్ట్ మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్”గా అభివర్ణిస్తున్నారు.
Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?
ఇక చెన్నై జట్టుతో జడేజాకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఏడాది కాలంగా కొన్ని మార్పులు జరిగినప్పటికీ, జడేజా మనసులో చెన్నై సూపర్ కింగ్స్ పట్ల ఉన్న గౌరవం, ప్రేమ ఏమాత్రం తగ్గలేదని ఈ ఘటన నిరూపించింది. ముఖ్యంగా 2024 ఐపీఎల్ ఫైనల్ చెన్నై గెలిచింది అంటే దానికి ఏకైక కారణం జడేజానే. జడ్డూ ఇప్పటికీ సీఎస్కేను ప్రేమిస్తున్నాడు, ఆ జట్టు లోగోను ముద్దాడటం చూస్తుంటే ముచ్చటేస్తోంది అంటూ చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఈ ఫోటోలు AI జనరేటెడ్ అంటూ కొట్టిపారేస్తున్నారు.
తాజావార్తలు
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్‌కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
-
TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
-
World EV Day 2026: Ather నుంచి Bajaj Chetak వరకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే.. రేంజ్, ధర వివరాలు
-
Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!