NTV Telugu Site icon

Modi Tour: మరో 26 రాఫెల్ విమానాలు.. ప్రధాని ఫ్రాన్స్ పర్యటన వేళ కీలక ఒప్పందానికి ఛాన్స్

Modi Tour

Modi Tour

Modi Tour: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వారంలో రెండు రోజులపాటు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన వేళ ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ యుద్ధ విమానాలను, 3 స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాములను కొనుగోలు చేయాలని భారత్ యోచిస్తోంది. ఈ వారం ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా వీటి కొనుగోలు ఒప్పంద వివరాలు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను కేంద్రం అంగీకరించి.. ఫ్రాన్స్ పర్యటనలో ఒప్పందం జరిగితే భారత నావికాదళానికి 22 సింగిల్-సీట్ రాఫెల్ మెరైన్ విమానాలు, 4 ట్రైనర్ విమానాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య, విక్రాంత్‌లు మిగ్ 29లను నడుపుతున్నాయి. దేశ భద్రత సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ యుద్ధ విమానాలు, జలాంతర్గాములను కొనాలని భారత నౌకాదళం భావిస్తోంది.

Also Read: Nepal PM Wife Passes Away: నేపాల్‌ ప్రధాని భార్య అనారోగ్యంతో కన్నుమూత

పాకిస్థాన్, చైనాలతో విభేదాల నేపథ్యంలో భారత్ తన సైనిక శక్తిని పెంచుకోవడంపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి శత్రుభీకర రాఫెల్ యుద్ధ విమానాలను అందుకున్న భారత్… మోదీ పర్యటనను మరిన్ని ఆయుధ కొనుగోళ్లకు అవకాశంగా మలుచుకోనుంది. మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా 26 రాఫెల్ యుద్ధ విమానాలు, 3 స్కార్పియన్ క్లాస్ జలాంతర్గాముల కొనుగోలుకు మేక్రాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ముందు భారత నేవీ పలు ప్రతిపాదనలు ఉంచింది. గత కొన్నేళ్లలో రక్షణరంగంలో భారత్ అనేక సాంకేతిక పరిజ్ఞానాలు, ఆయుధాలను కొనుగోలు చేసింది.

Also Read: North Korea: బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

తాజాగా ఫ్రాన్స్‌తో భారత్ రాఫెల్ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఫ్రాన్స్ నుంచి భారత్ ఇప్పటికే వైమానిక దళం కోసం రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు నావికా దళం కోసం రాఫెల్-ఎం విమానాలను కొనేందుకు సిద్ధమవుతోంది. ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం భారత్ 26 రాఫెల్ యుద్ధ విమానాలు, మూడు అటాక్ సబ్ మెరైన్లు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. జులై 13, 14 తేదీల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే ఈ కొనుగోలు ఒప్పందంపై మోదీ సంతకం చేసే అవకాశం ఉంది

అయితే, భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పర్యటనలో ఇది కేవలం ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలే కాదు. అరుదైన గౌరవంగా, మూడు సేవలతో కూడిన భారత సైనిక బృందం బాస్టిల్ డే వేడుకల్లో పాల్గొంటుంది. 1789లో ఫ్రెంచ్ విప్లవం సమయంలో బాస్టిల్ జైలుపై జరిగిన దాడిని గుర్తుచేసే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవం లేదా బాస్టిల్ డే, ఫ్రెంచ్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. బాస్టిల్ డే రోజులన ఐకానిక్ లౌవ్రే మ్యూజియంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో పాటు పలువురితో కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లోని భారతీయ సమాజంతో సమావేశంలో పాల్గొననున్నారు.