సినిమా ప్రపంచంలో రజనీకాంత్ ఒక లెజెండ్. అయితే ఆయన వెలుగు వెనుక ఉన్న చీకటి రోజులు, పడ్డ కష్టాల గురించి ఆయన సన్నిహితులకు మాత్రమే తెలుసు. తాజాగా నటి రాధికా శరత్‌కుమార్, రజనీకాంత్‌తో తనకున్న ఒక ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు.రాధికా మాట్లాడూతూ ‘ఒక రాత్రి రజనీకాంత్ నేను తన బైక్ మీద చెన్నై నగరం అంతా తిరుగుతూ ఉన్నాం. అపుడు రజనీకాంత్ తన సినీ ప్రయాణంలో ముందు ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. “నేను ఇక్కడే పడుకునేవాడిని, ఈ హోటల్‌లోనే తినేవాడిని, ఆ రోజుల్లో నేను ఇక్కడే ఉండేవాడిని” అంటూ రజనీకాంత్ సినిమా ప్రయాణంలో ఎదురుకొన్న కష్టాలను చెప్తూ చాలా ఎమోషన్ అయ్యాడు.
రజనీకాంత్ అంటే కేవలం స్టార్ మాత్రమే కాదు, ఓర్పు మరియు కష్టానికి నిలువుటద్దం అని ఆ క్షణం అర్థమైంది. అయితే మేము అలా బైక్ రైడ్ చేస్తున్న టైమ్ లో ఒక అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. మేము బైక్‌పై వెళ్తుండగా ఒక కారు వేగంగా వచ్చి మా మందు ఆగింది. దాంతో మేము ఒక్కసారిగా భయపడిపోయాం. ఆ కారులో నుండి దిగింది మరెవరో కాదు.. రజనీకాంత్ భార్య లతరజనీకాంత్ సోదరుడు, సంగీత దర్శకుడు అనిరుధ్ తండ్రి అయిన రవి రాఘవేంద్ర. నిజానికి మేమిద్దరం కలిసి బయటకు వెళ్తున్న విషయం రజనీ భార్య లతకు తెలుసు. కానీ, ఆ విషయం తెలియని రవి రాఘవేంద్ర మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. అందుకే మమ్మల్నివెంబడించి మరీ అడ్డుకున్నారు. తీరా చూశాక అక్కడ ఉన్నది రాధిక అని తెలిసి రవి ఆశ్చర్యపోయారు. ఈ చిన్న అపార్థం అప్పట్లో ఒక ఫన్నీ మూమెంట్ గా కాస్త టెన్షన్ సంఘటనగా మిగిలిపోయింది’ అని అన్నారు.
