Radhika-Rajinikanth: హేమ కమిటీ రిపోర్ట్.. రజనీకాంత్ వ్యాఖ్యలపై స్పందించిన రాధిక!
- లైంగిక వేధింపులపై హేమ కమిటీ రిపోర్ట్
- మౌనంగా రజనీకాంత్
- అగ్ర నటీనటులు స్పందించాలంటున్న రాధిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Radhika About Rajinikanth silence on Hema Committee Report: మలయాళ చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ గురించి కేరళ ప్రభుత్వానికి జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రిపోర్ట్ అన్ని సినీ పరిశ్రమలలో సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయంపై కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ మాట్లాడుతూ.. హేమ కమిటీ రిపోర్ట్ గురించి తనకేమీ తెలియదని చెప్పారు. రజనీ వ్యాఖ్యలపై సోమవారం (సెప్టెంబర్ 2) కోలీవుడ్ సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ స్పందించారు. హేమ కమిటీ నివేదికపై అగ్ర నటీనటులు మౌనం వహించడాన్ని ఆమె తప్పుపట్టారు.
రాధిక శరత్‌కుమార్ మాట్లాడుతూ… ‘హేమ కమిటీ రిపోర్ట్ గురించి రజనీకాంత్‌కు ఏమైనా తెలిసి ఉంటే కచ్చితంగా మాట్లాడేవారు. తెలియదు కాబట్టే ఆయన ఏం మాట్లాడలేదు. అయితే మీ మౌనాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు. అగ్ర నటీనటులు ఈ విషయం గురించి మాట్లాడాలి. స్టార్ హీరోల మాటలు మహిళా నటులకు ఎంతో ఉపశమనమిస్తాయి. వేధింపులకు గురైన నటీమణుల్లో న్యాయంపై ఆశను కలిగిస్తాయి. ప్రజలు కూడా ఈ సమస్యపై మాట్లాడాలి. అందరూ బయటకు వచ్చి మాట్లాడాలి’ అని అన్నారు.
Also Read
Also Read: Yograj Singh: ప్రపంచం మీపై ఉమ్మివేస్తుంది.. కపిల్ దేవ్‌ను టార్గెట్ చేసిన యువరాజ్ తండ్రి!
‘కోలీవుడ్‌లోని అగ్ర నటీనటులు చాలా మంది ప్రస్తుతం రాజకీయ ప్రస్థానాన్ని కలిగి ఉన్నారు. సమాజం కోసం వారు చాలా కష్టపడుతున్నారు. అలానే తోటి నటీమణుల బాధను అర్థం చేసుకొని వాళ్లకు మద్దతు ఇవ్వాలి’ రాధిక శరత్‌కుమార్ కోరారు. హేమ కమిటీ రిపోర్ట్‌పై రాధిక స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు.. చాలా ఇండస్ట్రీల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. కొంతమంది వ్యక్తులు నటీమణుల కారవాన్‌లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు ఉన్నాయన్నారు.
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!