NTV Telugu Site icon

Radhika-Rajinikanth: హేమ కమిటీ రిపోర్ట్‌.. రజనీకాంత్‌ వ్యాఖ్యలపై స్పందించిన రాధిక!

Radhika Rajinikanth

Radhika Rajinikanth

Radhika About Rajinikanth silence on Hema Committee Report: మలయాళ చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ గురించి కేరళ ప్రభుత్వానికి జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రిపోర్ట్‌ అన్ని సినీ పరిశ్రమలలో సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయంపై కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ మాట్లాడుతూ.. హేమ కమిటీ రిపోర్ట్‌ గురించి తనకేమీ తెలియదని చెప్పారు. రజనీ వ్యాఖ్యలపై సోమవారం (సెప్టెంబర్ 2) కోలీవుడ్ సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ స్పందించారు. హేమ కమిటీ నివేదికపై అగ్ర నటీనటులు మౌనం వహించడాన్ని ఆమె తప్పుపట్టారు.

రాధిక శరత్‌కుమార్ మాట్లాడుతూ… ‘హేమ కమిటీ రిపోర్ట్‌ గురించి రజనీకాంత్‌కు ఏమైనా తెలిసి ఉంటే కచ్చితంగా మాట్లాడేవారు. తెలియదు కాబట్టే ఆయన ఏం మాట్లాడలేదు. అయితే మీ మౌనాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు. అగ్ర నటీనటులు ఈ విషయం గురించి మాట్లాడాలి. స్టార్‌ హీరోల మాటలు మహిళా నటులకు ఎంతో ఉపశమనమిస్తాయి. వేధింపులకు గురైన నటీమణుల్లో న్యాయంపై ఆశను కలిగిస్తాయి. ప్రజలు కూడా ఈ సమస్యపై మాట్లాడాలి. అందరూ బయటకు వచ్చి మాట్లాడాలి’ అని అన్నారు.

Also Read: Yograj Singh: ప్రపంచం మీపై ఉమ్మివేస్తుంది.. కపిల్ దేవ్‌ను టార్గెట్ చేసిన యువరాజ్ తండ్రి!

‘కోలీవుడ్‌లోని అగ్ర నటీనటులు చాలా మంది ప్రస్తుతం రాజకీయ ప్రస్థానాన్ని కలిగి ఉన్నారు. సమాజం కోసం వారు చాలా కష్టపడుతున్నారు. అలానే తోటి నటీమణుల బాధను అర్థం చేసుకొని వాళ్లకు మద్దతు ఇవ్వాలి’ రాధిక శరత్‌కుమార్ కోరారు. హేమ కమిటీ రిపోర్ట్‌పై రాధిక స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు.. చాలా ఇండస్ట్రీల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. కొంతమంది వ్యక్తులు నటీమణుల కారవాన్‌లలో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి ప్రైవేట్‌ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు ఉన్నాయన్నారు.

Show comments