Site icon NTV Telugu

Dior Dress: రాధికా మర్చంట్ వేసుకున్న డ్రెస్ ధరతో ఓ సామాన్య కుటుంబం ఏడాది బతికేయొచ్చుగా..

Dress

Dress

ఇటలీ లోని పోర్టోఫినోలో జరిగిన వేడుకల కోసం అనిల్ అంబానీకి కాబోయే కోడలు రాధికా మర్చంట్ బార్బీకోర్ ట్రెండ్‌ ను పాటించింది. రాధికా క్రిస్టియన్ డియోర్ డిజైన్ చేసిన ఆటం వింటర్ 1959 హాట్ కోచర్ సేకరణ నుండి వైవ్స్ సెయింట్ లారెంట్ రూపొందించిన హేట్ కోచర్ కాక్‌టెయిల్ దుస్తులను ధరించింది. క్రిస్టియన్ డియోర్ ఇంటి నుండి చాలా ఆర్కైవల్ దుస్తులు మ్యూజియంలలో ఉండగా, వాటిలో రాధిక ధరించిన దుస్తులు 2016లో వేలం వేయబడ్డాయి. అందులో ఆ డ్రెస్ రూ. 3,20,714 భారీ ధరకు విక్రయించబడింది.

Nirmala Sitharaman: రామోజీ కుటుంబ సభ్యులకు ప్రధాని సందేశం అందించిన నిర్మలా సీతారామన్

ఇక వేలంలో ఇంత ధరను పలకడానికి గల కారణాలను చూస్తే.. ఆ డ్రెస్ ప్రకాశవంతమైన రాస్ప్బెర్రీ పింక్ కలర్ తో వైరల్ బార్బీకోర్, కోక్వేట్ కోర్ ఫ్యాషన్ ట్రెండ్‌ లను మిళితం చేస్తాయి. అలాగే బావ్స్, ఫ్రిల్స్ వంటి వివరాలతో ఉంటాయి. స్లీవ్ లెస్ డ్రెస్ 1959 నాటిది అయినకానీ., ఇప్పుడది ట్రెండ్ గా మారింది. ఇక ఈ డ్రెస్ లో, విశాలమైన భుజం పట్టీలు, చతురస్రాకారపు నెక్‌లైన్‌ పై చీలిక, అమర్చిన బాడీస్, సిన్చ్డ్ వెస్ట్‌లైన్. ప్లీటెడ్ వాల్యూమినస్ స్కర్ట్ సమిష్టిలతో ఈ డ్రెస్ అందాన్ని మరింత పెంచుతాయి.

Siva lingam: రోజుకు 3 రంగుల్లోకి మారుతున్న శివలింగం.. ఎక్కడంటే..

ఇకపోతే జూలై 12 నుండి 14 వరకు మూడు రోజుల పాటు జరిగే వేడుకలో రాధికా మర్చంట్, అనంత్ అంబానీ వివాహం చేసుకోనున్నారు. శుక్రవారం, జూలై 12న వివాహ కార్యక్రమం వివాహంతో వేడుకలు ప్రారంభమవుతాయి.

Exit mobile version