ఫిల్మ్ ఇండస్ట్రీలో పని గంటల విషయం హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. దీపిక స్టార్ చేసిన ఈ పాయింట్ పై ప్రతి ఒక్కరు ఏదో రకంగా స్పందిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా నటి రాధికా ఆప్టే కూడా తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయింది. అనతి కాలంలోనే తన గ్లామర్.. నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇటీవల తల్లి అయిన తర్వాత తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులు వచ్చాయట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
Also Read : Bhogi Festival : ఈ భోగి మిస్ అయ్యారా? అయితే మళ్లీ 16 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే!
‘వారం రోజుల పాటు నా బిడ్డను చూడకుండా ఉండటం నాకు సాధ్యం కాదు. అందుకే షూటింగ్ గంటలను మార్చాల్సిన అవసరం చాలా ఉంది. ఈ నిర్ణయం తీసుకునే క్రమంలో ఎన్నో వాదనలు, గొడవలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఒక నటిగా తన హక్కుల కోసం ఎంతగా పోరాడాలో తెలిసి.. ఆశ్చర్యపోయా. అలాంటప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ లను సెట్‌కు తీసుకురమ్మని చాలామంది సలహాలు ఇస్తున్నారు, కానీ అది సరైన పరిష్కారం కాదు. మాతృత్వానికి ప్రాధాన్యత ఇవ్వడమే నాకు ముఖ్యం’ అని రాధికా స్పష్టం చేశారు. అంతే కాదు
ఇకపై తాను సైన్ చేసే సినిమాల విషయంలో ..‘రోజుకు గరిష్టంగా 12 గంటల షిఫ్ట్ మాత్రమే ఉండాలని, అందులో ప్రయాణం, మేకప్, హెయిర్, షూటింగ్ సమయం అంతా కలిపి ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ ప్రయాణానికే రెండు గంటలు పడితే, దానిని కూడా పని గంటలు గానే పరిగణించాలని’ ఆమె పట్టుబడుతున్నారు. అంతేకాకుండా, వీలైనంత వరకు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేస్తానని, వారపు సెలవు కచ్చితంగా ఉండాలని.. కేవలం చిన్న సినిమాల విషయంలో మాత్రమే కొన్ని మినహాయింపులు ఇస్తానని చెబుతూనే, తన వృత్తిపరమైన బాధ్యతలతో పాటు బిడ్డతో గడిపే సమయానికి ఎక్కడా రాజీ పడబోనని రాధికా ఆప్టే ఈ సందర్భంగా గట్టిగా చెప్పుకొచ్చింది. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
