NTV Telugu Site icon

Bhaje Vaayu Vegam OTT: ఓటిటిలోకి వచ్చేసిన “భజే వాయు వేగం”.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Bhaje Vayu Vegam Review

Bhaje Vayu Vegam Review

Bhaje Vaayu Vegam OTT: హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో కార్తికేయ. ఆయన హీరోగా.. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం “భజే వాయు వేగం”. ఈ సినిమాలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీల‌క పాత్ర పోషించాడు. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా మే 31న‌ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పంద‌నే వ‌చ్చింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న వారికి ఫైనల్ గా ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జూన్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్నట్లు అఫీషియల్ గా ప్రకటిస్తూ ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ చిత్రం నేటి నుంచి అందుబాటులోకి ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతానికి ఒక్క తెలుగులో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఈ చిత్రానికి రధన్ పాటలు అందించగా కపిల్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

Read Also:IND vs SA: ఫైనల్కు వర్షం ముప్పు.. రిజర్వ్ డే ఉందా?

కథ విషయానికి వస్తే… చిన్నప్పుడు వెంకట్(కార్తికేయ) వాళ్ల తల్లిదండ్రులు చనిపోవడంతో రాజు(రాహుల్) వాళ్ల నాన్న లచ్చన్న(తణికెళ్ల భరణి) వెంకట్ ని దగ్గరికి తీస్తాడు. వెంకట్ కి చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే ఇష్టం ఉండడంతో దాని మీదే పూర్తి ఫోకస్ పెడతాడు. కెరీర్ కోసం వెంకట్, రాజు ఇద్దరూ హైదరాబాద్ కు వెళ్తారు. రాజుకి బ్యాక్ డోర్ జాబ్ కోసం లచ్చన్న ఊళ్లో పొలం అమ్మి డబ్బులు పంపిస్తాడు. మరోవైపు వెంకట్ క్రికెట్ బాగా ఆడినప్పటికీ స్టేట్ టీంలోకి తీసుకోవాలంటే రూ.10 లక్షలు అడగడంతో డబ్బులు లేక బెట్టింగులు వేస్తూ జీవితం గడుపుతుంటాడు. ఫేక్ ఎక్స్పీరియన్స్ జాబ్ అని తెలియడంతో రాజు జాబ్ లో నుంచి తీసేస్తే ఓ హోటల్లో డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. ఈ విషయాలు ఏవి వాళ్ల నాన్నకు తెలియకుండా వాళ్ళ నాన్న వచ్చినప్పుడు మాత్రం బాగా సంపాదిస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంటారు. అనుకోకుండా ఈ విషయం వాళ్ల నాన్నకు తెలిసి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. వాళ్ళ నాన్నకు ఆపరేషన్ చేయించడానికి రూ.20 లక్షలు కావాల్సి వస్తుంది. డబ్బులు కోసం వెంకట్ ఓ పెద్ద బెట్టింగ్ వేస్తాడు. అదే సమయంలో రాజు కూడా డబ్బులు ట్రై చేసినా దొరకవు. అదే సమయంలో వెంకట్ లవర్ ఇందు ఓ ట్విస్ట్ ఇస్తుంది. అసలు వాళ్ల నాన్న ఆపరేషన్ కి డబ్బులు వచ్చాయా? వెంకట్ బెట్టింగ్ లో గెలిచాడా? ఇందు ఏం ట్విస్ట్ ఇచ్చింది.? హైదరాబాద్ మేయర్ జార్జ్, వాళ్ల తమ్ముడు డేవిడ్ కి, వెంకట్ కి ఉన్న సంబంధం ఏంటనేది సినిమాను చూస్తే తెలుస్తుంది.

Read Also:Kalki 2898AD : కల్కిలో నటించిన మృణాల్.. తెగ మెచ్చుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్

Show comments