Rachin Ravindra Breaks Devon Conway’s ODI World Cup Record in Just 15 Minutes: వన్డే ప్రపంచకప్ 2023 మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించి మెగా టోర్నీని ఘనంగా ఆరంభించింది. 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 36.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. డెవాన్ కాన్వే (152 నాటౌట్; 121 బంతుల్లో 19×4, 3×6), రచిన్ రవీంద్ర (123 నాటౌట్, 96 బంతుల్లో 11×4, 5×6) సెంచరీలతో చెలరేగిపోయారు.
బంతి బాగా తిరిగే అహ్మదాబాద్‌లో 283 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కివీస్‌కు అంత తేలిక కాదని అందరూ అనుకున్నారు. ముగ్గురు స్పిన్నర్లు ఆదిల్ రషీద్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టన్‌లు ఉండడమే కాక.. ఆరంభంలోనే విల్ యంగ్ (0) వికెట్ పడిపోయింది. దాంతో ఇక కివీస్ పని అయిపొయింది అనుకున్నారు. అయితే కివీస్ ఆశ్చర్యకరంగా స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రను మూడో స్థానంలో దింపింది. రచిన్ ఇంగ్లిష్ బౌలింగ్‌కు పెద్ద షాకే ఇచ్చాడు. ఆరంభం నుంచే బౌలర్లపై ఎదురుదాడి చేసి.. పరుగుల వరద పారించాడు. డేవాన్ కాన్వే సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే.. రచిన్ ధనాధన్ సెంచరీ సాధించాడు.
Also Read: Asian Games 2023: బంగ్లాదేశ్‌తో సెమీస్ మ్యాచ్.. టాస్ నెగ్గిన భారత్! షహబాజ్ అరంగేట్రం
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవాన్ కాన్వే 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది న్యూజిలాండ్‌కు ప్రపంచకప్‌లో వేగవంతమైన సెంచరీగా నమోదైంది. మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ రికార్డును కాన్వే బ్రేక్ చేశాడు. 2015లో బంగ్లాదేశ్‌పై 88 బంతుల్లో గప్టిల్ సెంచరీ చేసాడు. అయితే ఈ ఆనందంను కాన్వేకు 15 నిమిషాలు కూడా రచిన్ రవీంద్ర ఉండనివ్వలేదు. కాన్వే శతకం బాదిన 15 నిమిషాల తర్వాత రచిన్ 82 బంతుల్లో సెంచరీ చేశాడు. 23 ఏళ్ల రచిన్ ఇప్పుడు కివీస్ తరఫున ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు.