NTV Telugu Site icon

Rachamallu Siva Prasad Reddy: ఓటమిపై వైసీపీ నేత రాచమల్లు రియాక్షన్‌..

Rachamallu

Rachamallu

Rachamallu Siva Prasad Reddy: కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటమిపై స్పందించారు.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రొద్దుటూరు వాసుల ప్రజాతీర్పును గౌరవిస్తాను అన్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నేను నిబద్ధతగా ప్రజాలకోసమే పాలన చేశా.. ఉద్యోగస్తుల విషయంలో వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూనే వచ్చాను.. ప్రతీ ఉద్యోగస్తులకు నా కృతజ్ఞతలు అన్నారు. నేను ఎమ్మెల్యే గా పనిచేసిన 10 సంవత్సరాల కాలంలో వ్యాపారస్తుల కోసం పనిచేసా… ఎక్కడా ఎవరినీ ఇబ్బందిపెట్టలేదు.. పెట్టబోను అన్నారు. నియోజకవర్గ పరిధిలో నా గడపతొక్కిన ప్రతీ పేదమనిషికీ సహాయం చేస్తూనే వచ్చాను. నన్ను రెండుపర్యాయలు ఎమ్మెల్యే గా చేసిన ప్రజలకు నేను రుణపడి ఉంటానన్నారు.

Read Also: Pushpa 2 : ‘పుష్ప 2’ కు తప్పని రీ షూట్స్ గండం.. కారణం అదేనా..?

ఇక, రాజకీయాల్లో గెలుపోటములు సాధారణం.. ప్రజలను నిందించడం తగదు అన్నారు రాచమల్లు.. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన హామీలు అన్ని నెరవేర్చాలని నేను కోరుకుంటున్నానన్న ఆయన.. వరదరాజుల రెడ్డికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.. వరదరాజుల రెడ్డిపై నాకు ఎప్పటికీ గౌరమే.. ఆయన నా రాజకీయగురువుగా తెలిపారు. వరదరాజుల రెడ్డి పాలన గొప్పగా అందించాలని కోరుకుంటున్నా.. టీడీపీ చేయబోయే అభివృద్ధికి నేను సహకరిస్తానని ప్రకటించారు. సంవత్సరం పాటు నేను టీడీపీని విమర్శించను.. తర్వాత ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి ప్రశ్నిస్తా అన్నారు. శాంతియుతంగా ప్రజలపక్షాన.. ఎల్లపూడూ పోరాడుతూనే ఉంటా.. 83,000 మంది ప్రజలు నా వైసీపీ జెండాకు ఓట్లేశారు.. వాళ్లు నాతో ఉన్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక, శాంతిభద్రతలు కాపాడాలని పోలీసులను కోరారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.