నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 13 బీసీ సంఘాలు అభినందించాయి. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపాయి. మరోవైపు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడు రోజులు అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుందాగా ప్రవర్తిస్తున్న తీరు.. ప్రజా సమస్యల పరిష్కరానికి ఎన్నికల తీరు చాలా గొప్పగా ఉందని ఆర్. కృష్ణయ్య తెలిపారు. గత ప్రభుత్వం నిరంకుశంగా, ప్రజా వ్యతిరేకంగా ప్రవర్తించడంతో.. నిరుద్యోగులు, బి.సి సంఘాలు పోరాటం చేసి ఆ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రిపై బీసీలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. గత ప్రభుత్వం బీసీలను అణిచి పెట్టిందని ఆరోపించారు.
Read Also: Madhya Pradesh: బీజేపీకి ఓటేసినందుకు ముస్లిం మహిళపై దాడి.. బాధితురాలిని కలిసిన సీఎం..
కాంగ్రెస్ పార్టీని విజయ పథాన నడిపించి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డిని ఆర్. కృష్ణయ్య అభినందించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు తొందరగా.. ముఖ్యంగా పంచాయతీరాజ్ రిజర్వేషన్లు 20 నుంచి 42 శాతంకు పెంచాలని తెలిపారు. విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లను 25 శాతం నుంచి 52 శాతంకు పెంచాలని.. జనాభా గణాంకాల్లో కులగణన చేపట్టాలని, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గుర్తు చేసారు. ప్రజాస్వామ్యానికి పునరుద్ధరించి.. ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతించాలని ఆర్. కృష్ణయ్య కోరారు.
Read Also: Indian Workers : ఏయే దేశాలలో భారతీయులు ఎక్కువగా పని చేస్తున్నారో తెలుసా?