NTV Telugu Site icon

Indigo service: ఇండిగో ఎయిర్లైన్స్ టికెట్ బుకింగ్ పై టీమిండియా క్రికెటర్ అసంతృప్తి..

Ashwin

Ashwin

ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే చేసిన పోస్ట్ ను రీపోస్ట్ చేస్తూ.. ‘ నేను ప్రయాణిస్తున్న విమానంలోనూ ఇలాంటి ఘటన ఎదురైంది. ఇండిగో ఎయిర్ లైన్స్లో ఇది సర్వ సాధారణమైపోయింది. మీతో ముందు పేమెంట్ చేయిస్తాయి. ఆ తర్వాత వారికి ఇష్టమైన సీటింగ్ ఇస్తారు. మనం ఏం కోరుకున్నా పట్టించుకోవు. ఇది స్కామ్ అని ఖచ్చితంగా తెలియదు. మీరు పేమెంట్ చేసినా.. మీరు బ్లాక్ చేసిన సీట్లను మాత్రం మీకు ఇవ్వరు. కావున, దయచేసి మీ టైం, ఎనర్జీని వృథా చేసుకోవద్దు’ అని ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

Read Also: Sri Krishna Art: వావ్.. కృష్ణయ్యని పెన్సిల్ మొనపై భలే చేసాడుగా..

ఇంతకు ముందు హర్షా భోగ్లే ఇదే విషయంపై ‘x’లో పోస్ట్ చేశారు. ‘ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఇటీవలే ఓ వృద్ధ దంపతులు టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే.. వారికి ఎలాంటి కారణం చెప్పకుండా.. 4వ వరుసలో ఉన్న వారి సీటింగ్ ను 19వ వరుసలోకి మార్చారు. ఆ వృద్ధ దంపతులు ఇరుకైన మార్గంలో నడిచి వెళ్లేందుకు ఎంతో కష్టపడ్డారు. ఇందుకు ఎవరిని బాధ్యులను చేయాలి. కనీసం వారి వయస్సుకైనా గౌరవం ఇవ్వాలి. అలా కాకుండా.. వృద్ధురాలు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. మున్ముందు ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని కోరుతున్నా.’ అని హర్షా భోగ్లే పోస్ట్ చేశారు.

Read Also: Xiaomi X Pro QLED: ‘షావోమీ’ నుంచి సూపర్ స్మార్ట్‌టీవీ.. ధర చాలా తక్కువ!