Site icon NTV Telugu

Qutub Minar: త్రివర్ణంలో మెరిసిన కుతుబ్‌ మినార్‌.. ఎన్నికల వేళ అవగాహనలో భాగంగా.. వీడియో వైరల్..

Qutub Minar

Qutub Minar

ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రెండు విడతలలో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 7 విడతలలో దేశం మొత్తం ఎన్నికల పూర్తికానున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఓవైపు లోక్ సభ ఎన్నికలు, మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయ నేతలు ప్రచారంలో కొనసాగుతూ ఓటర్లను మమేకం చేసుకుంటున్నారు.

Also Read: Race car Accident: ప్రేక్షకుల మీదకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు మృతి.. వీడియో వైరల్..

ఇక లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కుతుబ్‌ మినార్‌ త్రివర్ణపతాకంతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. కుతుబ్ మినార్ వద్ద జాతీయ కౌన్సిల్ భవనం, ఎన్నికల సంఘం లోగోలు, ఎన్నికలకు సంబంధించిన అంశాలను తాజాగా ప్రదర్శించారు.

Also Read: Telegram: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన టెలిగ్రామ్‌ సేవలు..

దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. మే 25న రాజధాని ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న పద్ధతులను అవలంబిస్తోంది. ఈ వేడుకలో కుతుబ్ మినార్ త్రివర్ణ పతాకంతో పాటు ఎన్నికలకు సంబంధించిన అంశాలను కూడా ప్రదర్శించారు. ఈ అంశంపై ఒక వీడియో ప్రచురించబడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఎన్నికల కమిషన్ సోషల్ మీడియాలో నేరుగా పోస్ట్ చేసింది.

Exit mobile version