NTV Telugu Site icon

Quinton de Kock: క్వింటన్‌ డికాక్‌ అరుదైన ఘనత.. గిల్‌క్రిస్ట్, ధోనీకి కూడా సాధ్యం కాలేదు!

Quinton De Kock

Quinton De Kock

Not MS Dhoni and Gilchrist, Quinton de Kock scripts history in ODI World Cup: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ చివరి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేశాడు. వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచే డికాక్ కెరీర్‌లో చివరిది. తాను ఆడిన చివరి వన్డేలో డికాక్‌కు నిరాశే ఎదురైంది. సెమీ ఫైనల్లో 14 బంతుల్లో 3 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. అంతేకాదు నాకౌట్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతులెత్తేసింది. అయితే డికాక్‌ తన కెరీర్‌ ఆఖరి వన్డే మ్యాచ్‌తో వరల్డ్‌కప్‌ రికార్డు నెలకొల్పాడు.

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో 10 మ్యాచ్‌లు ఆడిన క్వింటన్ డికాక్.. 4 సెంచరీల సాయంతో 594 పరుగులు చేశాడు. విరాట్‌ కోహ్లీ (10 మ్యాచ్‌ల్లో 711 పరుగులు) తర్వాత సెకెండ్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా డికాక్‌ ఉన్నాడు. ఈ ఎడిషన్‌లో 594 పరుగులు మాత్రమే కాదు.. 20 క్యాచ్‌లు కూడా పట్టాడు. దాంతో ప్రపంచకప్‌ చరిత్రలో 500 ప్లస్‌ పరుగులు, 20 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాటర్‌గా రికార్డులో నిలిచాడు. ఈ రికార్డు కీపింగ్ దిగ్గజాలు ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఎంఎస్ ధోనీలకు కూడా సాధ్యం కాలేదు.

Also Read: IND vs AUS World Cup Final: భారత్, ఆస్ట్రేలియా ఫైనల్‌.. నరేంద్ర మోదీ స్టేడియం వద్ద సూర్యకిరణ్‌ విన్యాసాలు!

అంతేకాదు ఓ సింగిల్‌ వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాలుగో వికెట్‌ కీపర్‌గా క్వింటన్ డికాక్ రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ (2003లో 21 క్యాచ్‌లు), టామ్‌ లాథమ్‌ (2019లో 21 క్యాచ్‌లు), అలెక్స్‌ క్యారీ (2019లో 20 క్యాచ్‌లు)లు డికాక్ కంటే ముందున్నారు. వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఆరంభానికి ముందే డికాక్ తన వన్డే రిటైర్మెంట్ ప్రకటన చేసిన విషయం తెగెలిసిందే. టెస్ట్ మ్యాచ్‌లు, టీ20లలో మాత్రం అతడు కొనసాగుతాడు.