NTV Telugu Site icon

Quinton De Kock: తన 150వ వన్డే మ్యాచ్‌లో రికార్డులు సృష్టించిన డికాక్‌

Quinton De Cock

Quinton De Cock

Quinton De Kock Hundred: దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్‌ డికాక్‌ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ వరల్డ్‌ కప్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన డికాక్‌.. తాజా మరో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో క్వింటన్‌ డికాక్‌ 140 బంతుల్లో 174 పరుగులు చేశాడు. 15 ఫోర్లు, 7సిక్సర్లతో పరుగుల మోత మోగించాడు. ఈ వరల్డ్‌ కప్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఆస్ట్రేలియా బ్యాటర్‌  డేవిడ్‌ వార్నర్‌ పాకిస్థాన్‌పై చేసిన  163 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును డికాక్‌ అధిగమించాడు. అతనితో పాటు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్ హెన్రిచ్‌ క్లాసెన్‌ 49 బంతుల్లోనే 90 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నిర్ణీత 50 ఓవర్లో సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 382 పరుగుల భారీ స్కోరు చేసింది.

 

Also Read: Sri lanka: శ్రీలంక వెళ్లాలనుకుంటున్నారా?.. భారత టూరిస్టులకు ఫ్రీ ఎంట్రీ

ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ 101 బంతుల్లో సెంచరీ సాధించాడు. క్వింటన్ డికాక్ 2015 ప్రపంచ కప్‌లో 2 సెంచరీల ఏబీ డివిలియర్స్ రికార్డును కూడా అధిగమించాడు. వాస్తవానికి ఈ వరల్డ్‌ కప్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ గతంలో ఆస్ట్రేలియా, శ్రీలంకపై సెంచరీలు సాధించాడు. అదే సమయంలో బంగ్లాదేశ్‌తో డికాక్ తన 150వ వన్డే మ్యాచ్‌ను ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇది అతనికి మూడో సెంచరీ. ఈ ప్రపంచకప్‌లో 3 సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా క్వింటన్ నిలిచాడు.దక్షిణాఫ్రికా తరఫున డికాక్ 320 ఇన్నింగ్స్‌లలో 12,000 అంతర్జాతీయ పరుగులు సాధించాడు. ఈ సమయంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ AB డివిలియర్స్ ఉన్న క్లబ్‌లోకి ప్రవేశించాడు.

Also Read: Ayodhya Temple: రామమందిరంలో అర్చకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలు ఇవే..

అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 12000 అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్
264 ఇన్నింగ్స్‌లు- హషీమ్ ఆమ్లా

285 ఇన్నింగ్స్ – గ్రేమ్ స్మిత్

300 ఇన్నింగ్స్‌లు – జాక్వెస్ కల్లిస్

305 ఇన్నింగ్స్‌లు – AB డివిలియర్స్

317 ఇన్నింగ్స్‌లు – గ్యారీ కిర్‌స్టన్

320 ఇన్నింగ్స్ – క్వింటన్ డి కాక్*

ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్

రోహిత్ శర్మ (2019) – 5 సెంచరీలు

కుమార్ సంగక్కర (2015) – 4 సెంచరీలు

క్వింటన్ డి కాక్ (2023)* 3 సెంచరీలు

డేవిడ్ వార్నర్ (2019) – 3 సెంచరీలు

మాథ్యూ హేడెన్ (2007) 3 సెంచరీలు

సౌరవ్ గంగూలీ (2003) 3 సెంచరీలు

మార్క్ వా (1996) – 3 సెంచరీలు

ప్రపంచ కప్ సీజన్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన సందర్భంలో 2019 ప్రపంచ కప్‌లో మొత్తం 5 సెంచరీలు చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో నిలిచి రికార్డును సృష్టించాడు. ఈ విషయంలో ఇప్పుడు క్వింటన్ డికాక్ కూడా ఆ క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో డికాక్‌ ఇప్పటివరకు 3 సెంచరీలు సాధించాడు.