NTV Telugu Site icon

Botsa Satyanarayana: ఐదేళ్ల పాలన చూసి మళ్లీ గెలిపించమని అడుగుతున్నాం..

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: జగన్‌ సంభాషణ చూస్తే రాజశేఖర్‌ రెడ్డి గుర్తొచ్చారని.. ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్‌ చూసేసరికి భావోద్వేగానికి గురయ్యానని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అది యాక్షన్ కాదు, ఆటోమేటిక్‌గా వచ్చింది.. దానికి సమాధానం చెప్పలేనన్నారు. జగన్‌కు అందరూ ఒక్కటేనని.. వైసీపీలో చేరినప్పుడే నన్ను నమ్మిన వారి కోసం రెండు మెట్లు దిగి ఇదే సరైన పార్టీ అని చెప్పానన్నారు. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేలపై నమ్మకంతోనే మార్పులు చేయలేదన్నారు. జగన్‌ అందరి మాటలు వింటారని.. ఏది ప్రయోజనకరమో దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. జగన్‌ అందరి మాటలు వింటారు.. ప్రజలకు ఉపయోగపడేదే చేస్తారన్నారు. 2004 నుంచే మా కుటుంబంలోని వారు పదవుల్లో ఉన్నారన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో ఉంటే తప్పన్నారు. 1999లోనే తాను ఎంపీని అయ్యానన్నారు. ప్రజలు ఆమోదించేవారికే సీట్లు ఇస్తారన్నారు.

Read Also: Vijaysai Reddy: జగన్ ను తొలగించాలని చంద్రబాబు కుట్ర

సీఎం జగన్‌ మేనిఫెస్టోతో దేశంలోనే కొత్త ఒరవడి సృష్టించారన్నారు. మేనిఫెస్టో మా భగవద్గీత అని పేర్కొన్నారు. నవరత్నాలు కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు. వైఎస్‌కు, జగన్‌కు తేడా ఏంటంటే ఫలితం వచ్చేవరకు పోరాటం చేస్తారని చెప్పారు. వైఎస్‌ ఫీ రీయింబర్స్‌మెంట్ పెడితే, జగన్‌ విద్యాదీవెన, విదేశీ విద్యాదీవెన పెట్టారన్నారు. చంద్రబాబులా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేదన్నారు. ఐదేళ్ల పాలనలో మంచి జరిగి ఉంటే ఓట్లు వేయమని జగన్‌ అడుగుతున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని చరిత్ర చంద్రబాబుదన్నారు. చంద్రబాబు ఇచ్చే హామీలను ప్రజలు నమ్మరన్నారు. అన్ని అప్పులు ఉంటే.. కూటమి ఇచ్చే హామీల అమలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అప్పులు తీసుకునేందుకు కూడా పరిమితులు ఉంటాయన్నారు. పెన్షన్‌ ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల పాలన చూసి మళ్లీ గెలిపించమని అడుగుతున్నామన్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పాం.. కానీ చేయలేకపోయామన్నారు. అంత కంటే మెరుగైన గ్యారెంటీ స్కీమ్ తీసుకొస్తున్నామన్నారు. అర్థం చేసుకోమని ఉద్యోగులను కూడా ఒప్పించామన్నారు.

Read Also: JP Nadda : దేశం బాగుండాలంటే కేవలం బీజేపీ వల్ల మాత్రమే సాధ్యం

డీఎస్సీ కింద 18,200 పోస్టులను భర్తీ చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నో వేకెన్సీ పేరిట కొత్త పాలసీని తీసుకొస్తున్నామన్నారు. డీఎస్సీపై చంద్రబాబు స్టడీ చేయకుండా మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహించారు. ఇకపై ఏ ఏడాదికి ఆ ఏడాదే ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రోడ్ల విషయంలో నూటికి నూరు శాతం చేశామని మేము చెప్పమన్నారు. కానీ.. రోడ్ల విషయంలో భూతద్దం పెట్టి చూడొద్దని చెప్తున్నామన్నారు. 10 వేల సచివాలయాలు కట్టాం.. అవి బిల్డింగ్ కాదా అని మంత్రి ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చింది చెప్పుకుంటే తప్పేముందన్నారు. గత మేనిఫెస్టోలో దశల వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పామన్నారు. మద్యం ధరలు పెంచి అందుబాటులో లేకుండా చేశామన్నారు. బెల్ట్‌ షాపులు తొలగించామని, చిన్నచిన్న పట్టణాల్లో బార్‌షాపులు తీసేశామన్నారు.