NTV Telugu Site icon

5G Smartphones: మొబైల్ ప్రియులకు శుభవార్త.. ఇక 8 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్!

Qualcomm New Chip

Qualcomm New Chip

5G Smartphones under 8K in India With Qualcomm New Chip: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ రంగంలో 5జీ నెట్‌వర్క్ హవా నడుస్తోంది. అందుకే మొబైల్ ప్రియులు 5జీ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారు. 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే రూ.10-15 వేలు తప్పనిసరి. మంచి ఫీచర్లు కోరుకునే వారు ఖచ్చితంగా రూ.20 వేలు పెట్టాల్సిందే. ఇంత మొత్తం వెచ్చించలేని వారు చాలానే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ ప్రియులకు అమెరికాకు చెందిన చిప్‌ తయారీ సంస్థ ‘క్వాల్‌కామ్‌’ శుభవార్తను అందించింది. క్వాల్‌కామ్‌ కొత్త ప్రాసెసర్‌ను విడుదల చేసింది. దాంతో 5జీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.8 వేలు, అంతకంటే తక్కువకే లభించే అవకాశం ఉంది.

భారత్‌ వినియోగదారుల కోసం ‘స్నాప్‌డ్రాగన్‌ ఫర్‌ ఇండియా’ ఈవెంట్‌ను క్వాల్‌కామ్‌ కంపెనీ మంగళవారం నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో ఎంట్రీ లెవల్‌ 5జీ హ్యాండ్‌సెట్ల కోసం ప్రత్యేకంగా ‘స్నాప్‌డ్రాగన్‌ 4ఎస్‌ జన్‌ 2’ ప్రాసెసర్‌ను క్వాల్‌కామ్‌ తీసుకొచ్చింది. ఈ ప్రాసెసర్‌ కారణంగా 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధరలు దిగొస్తాయని తెలిపింది. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను అందించాలన్న ఉద్దేశంతో కొత్త చిప్‌సెట్‌ను తీసుకొచ్చినట్లు క్వాల్‌కామ్‌ చెప్పింది.

Also Read: Bigg Boss Mehaboob: హైదరాబాద్‌లో రేవ్ పార్టీ.. బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్ షేక్‌ అరెస్ట్?

స్నాప్‌డ్రాగన్‌ 4ఎస్‌ జన్‌ 2తో తొలి డివైజ్‌ ఈ ఏడాది చివరికల్లా వచ్చే అవకాశం ఉన్నట్లు క్వాల్‌కామ్‌ పేర్కొంది. షావోమి సహా మరికొన్ని మొబైల్‌ తయారీ సంస్థలు ఈ ప్రాసెసర్‌ను వినియోగించనున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్ల ధరలు రూ.10 వేలపైనే ఉన్నాయి. ఏ కంపెనీ మొబైల్స్ చూసుకున్నా ధరలు బాగానే ఉన్నాయి.