NTV Telugu Site icon

Qatar-India: గూఢచర్యం ఆరోపణలు.. 8 మంది భారతీయులను విడుదల చేసిన ఖతార్‌ ప్రభుత్వం!

India Navy

India Navy

Qatar frees 8 Navy veterans: గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందిని ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సోమవారం తెల్లవారుజామున ఓ ప్రకటన విడుదల చేసింది. వీరికి విధించిన మరణశిక్షను ఇప్పటికే న్యాయస్థానం జైలు శిక్షగా మార్చగా.. తాజాగా దాని నుంచి విముక్తి కల్పించి భారత్‌కు అప్పగించారు. అల్ దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ సిబ్బందిలో ఏడుగురు ఖతార్ నుంచి భారత్‌కు చేరుకున్నారు. ఖతార్‌ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది.

‘ఖతార్‌లో నిర్బంధించబడిన అల్ దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. వారిలో ఎనిమిది మందిలో ఏడుగురు భారతదేశానికి తిరిగి వచ్చారు. ఖతార్ రాష్ట్ర ఎమిర్ నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాము’ అని ఎంఈఏ ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read: Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్ల వివరాలు ఇవే!

గత ఏడాది డిసెంబర్‌లో అల్ దహ్రా గ్లోబల్ కేసులో అరెస్టయిన ఎనిమిది మందికి విధించిన మరణశిక్షను ఖతార్ కోర్టు రద్దు చేసింది. మరణశిక్షను జైలు శిక్షగా మార్చగా.. తాజాగా దాని నుంచి విముక్తి కల్పించింది. మరణశిక్షకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ఖతార్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఆమోదించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఖతార్‌లో అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది భారత నేవీ అధికారులలో కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రగేష్ ఉన్నారు.

Show comments