ఒలింపిక్ విజేత, పద్మశ్రీ అవార్డు గ్రహీత పి.వి. సింధు ‘EBG ఫౌండేషన్’ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. పిల్లల సంక్షేమం, క్రీడల అభివృద్ధి, మహిళల ఆర్థిక పురోగతి కోసం ఈ సంస్థ చేసే పనులకు ఆమె మద్దతు ఇవ్వనున్నారు. ఈ భాగస్వామ్యం గురించి ఫౌండేషన్ సోమవారం కొన్ని ముఖ్య విషయాలను వెల్లడించింది. సింధు సహకారంతో ఈ ఫౌండేషన్ మూడు ప్రధాన కార్యక్రమాలను చేపట్టనుంది. అందులో ఒకటి చిల్డ్రన్ ఫర్ లైఫ్. పిల్లలకు చదువు, వైద్యం , రక్షణ కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. తెలంగాణలో ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది.
Also Read:Branded Shoes: ఆ షాపులో కేవలం రూ.1 కే బ్రాండెడ్ షూ.. ఎగబడ్డ జనం..
మరో కార్యక్రమం ఛాంపియన్. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి.. వారికి శిక్షణ, ఆట వస్తువులు , పౌష్టికాహారం అందిస్తారు. ఇక నారీ శక్తి కార్యక్రమంలో భాగంగా.. మహిళలు సొంతంగా ఎదిగేందుకు, వారికి వృత్తి విద్యా శిక్షణ ఇవ్వడంతో పాటు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు.
Also Read:Russia Support Iran: ‘ఇరాన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తాం’.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు..
పీవీ సింధు మాట్లాడుతూ.. ‘‘మనం ఇతరులకు సాయం చేసినప్పుడే నిజమైన విజయం లభిస్తుంది. పిల్లల ఎదుగుదల, మహిళల పురోగతి వంటి నాకు ఇష్టమైన పనుల కోసం ఈ సంస్థతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది,’’ అని సింధు తెలిపారు.
EBG గ్రూప్ వ్యవస్థాపకులు ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ.. సింధు క్రమశిక్షణకు మారుపేరని, ఆమె రాకతో తమ సంస్థ ఆశయాలు మరింత బలోపేతం అవుతాయని చెప్పారు. ఈ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సింధు నటించిన మూడు షార్ట్ ఫిల్మ్స్‌ను కూడా ఫౌండేషన్ విడుదల చేయనుంది.