NTV Telugu Site icon

PV Sindhu: తన వివాహానికి పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానించిన పీవీ సింధు

Pv Sindhu

Pv Sindhu

PV Sindhu: ఒలింపిక్ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. పెద్దలు కుదిర్చిన సంబంధంతో వివాహ బంధంలోకి భారత బ్యాడ్మింటన్ స్టార్‌ పీవీ సింధు అడుగుపెట్టబోతోంది. ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా పీవీ సింధు వివాహం జరగనుంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులను తన వివాహానికి హాజరు కావాలని సింధు ఆహ్వానిస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను తన వివాహానికి హాజరు కావాలని పీవీ సింధు ఆహ్వానించారు. మంగళగిరిలోని పవన్ కార్యాలయానికి వెళ్లి పెళ్లి శుభలేఖను అందజేశారు.

Read Also: Lavanya Tripathi as Sati Lilavati: పుట్టినరోజు సందర్బంగా కొత్త సినిమా అప్డేట్ ఇచ్చిన మెగా కోడలు.. ‘స‌తీ లీలావ‌తి’ అంటూ

శనివారం మధ్యాహ్నం పీవీ సింధు కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్‌మెంట్ వేడుక నిర్వహించబడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సింధు, వెంకట దత్తసాయి పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. సింధు తన ఎంగేజ్‌మెంట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఫొటోకు “ఒకరి ప్రేమ దక్కిన సమయంలో, తిరిగి మనం ప్రేమించాలి” అనే క్యాప్షన్ జత చేశారు. ఎంగేజ్‌మెంట్ వేడుకలో వారు కేక్ కట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. పీవీ సింధు వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, భారత్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ హాజరు కానున్నట్లు సమాచారం.