PV Sindhu: తన వివాహానికి పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించిన పీవీ సింధు
- ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా పీవీ సింధు వివాహం
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వివాహానికి ఆహ్వానించిన పీవీ సింధు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PV Sindhu: ఒలింపిక్ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. పెద్దలు కుదిర్చిన సంబంధంతో వివాహ బంధంలోకి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అడుగుపెట్టబోతోంది. ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా పీవీ సింధు వివాహం జరగనుంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులను తన వివాహానికి హాజరు కావాలని సింధు ఆహ్వానిస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తన వివాహానికి హాజరు కావాలని పీవీ సింధు ఆహ్వానించారు. మంగళగిరిలోని పవన్ కార్యాలయానికి వెళ్లి పెళ్లి శుభలేఖను అందజేశారు.
Also Read
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
శనివారం మధ్యాహ్నం పీవీ సింధు కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ వేడుక నిర్వహించబడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సింధు, వెంకట దత్తసాయి పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. సింధు తన ఎంగేజ్మెంట్ ఫొటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఫొటోకు “ఒకరి ప్రేమ దక్కిన సమయంలో, తిరిగి మనం ప్రేమించాలి” అనే క్యాప్షన్ జత చేశారు. ఎంగేజ్మెంట్ వేడుకలో వారు కేక్ కట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. పీవీ సింధు వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, భారత్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ హాజరు కానున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!